జైల్లో ఖైదీల ముందు హిజ్రాలతో అసభ్య నృత్యాలు... విచారణకు ఆదేశం

పాట్నా: బీహార్‌లోని సరాన్ జిల్లా చాప్రా జైలులో ఖైదీలో కోసం వినోదం పేరిట సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమం వివాదాస్పదం అయింది. 'చైతా' లేదా 'స్ప్రింగ్ ప్రోగ్రామ్' పేరిట కొందరు ఖైదీలు డ్యాన్సు ప్రోగ్రామ్ పెట్టి నృత్యాలు చేసేందుకు హిజ్రాలను పిలిపించారు.

హిజ్రాలతో ఖైదీలు కలిసి డ్యాన్సులు చేశారు. ఆ దృశ్యాలు ఇప్పుడు ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తున్నాయి. ఈ సంఘనటపై సారన్ జిల్లా మేజిస్ట్రేట్ దీపక్ ఆనంద్ విచారణకు ఆదేశించడంతో పాటు, జైలు సూపర్‌డెంట్‌కు షోకాజ్ నోటీసులు పంపారు.

Bihar jail rocks to dancers, prisoners and cops watch show

ఈ సంఘటనపై ఐజీ (జైలు) ప్రేమ్ సింగ్ మీనా స్పందించారు. చాప్రా జైలు పరిధిలో అసభ్య నృత్యాలకు అనుమతించిన అధికారులపై విచారణ జరుగుతుందని ఆయన తెలిపారు. దీంతో విచారణను మొదలు పెట్టిన పోలీసులు ఖైదీలతో డ్యాన్సులు చేసిన హిజ్రాలను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

వారిని గార్గా పోలీసు స్టేషన్ పరిధిలో ఉన్న ముకింపుర్ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ఖైదీల ముందు అసభ్య నృత్యాలు చేసిన వారిలో మహిళలు లేరని పోలీసులు తెలిపారు. మగవారికి ఆడవేషాలు వేసి నృత్యాలు చేయించారని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+