భార్యను పోర్న్ ఫిల్మ్ మేకర్స్‌కు అమ్మిన భర్త

పాట్నా: బీహార్‌లో దారుణం చోటు చేసుకుంది. పెళ్లయి కనీసం నెలన్నర కూడా గడువక ముందే తన భార్యను రూ. 7 లక్షలకు పోర్న్ వీడియోలు తీసే వారికి అమ్మేశాడు. తన తోటి కోడలు ద్వారా ఈ విషయం తెలుసుకున్న ఆ యువతి అక్కడ నుంచి ఎలాగో ఒకలా రాత్రికి రాత్రే ప్రాణాలు అరచేతబట్టుకొని తన సొంతింటికి చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

వివరాల్లోకి వెళితే... బీహార్‌లోని సరాన్ జిల్లాకు చెందిన తరయా అనే గ్రామంలో రీతా దేవీ (పేరు మార్చాం)కి అదే రాష్ట్రానికి చెంది హర్యానాలోని పాటికారా అనే గ్రామంలో స్థిరపడిన టికు పాటికర్ అనే వ్యక్తికి ఇచ్చి విహవాం చేశారు. ఈ ఏడాది జనవరి 8న వారి వరుడి ఊర్లోని ఆలయంలో సాంప్రదాయబద్ధంగా పెద్దల సమక్షంలో వీరిద్దరి వివాహం జరిగింది.

Bihar man sells wife to porn filmmaker over non-payment of dowry

ఆనంతరం ఆమెను తన భర్త గ్రామానికి కాపురానికి హర్యానా పంపించారు. అయితే, అదనపు కట్నం కోసం కాపురానికి వెళ్లినప్పటి నుంచి ఆమెను వేధించడం మొదలుపెట్టారు. రూ. 2 లక్షల కట్నంతో పాటు ఓ రాయల్ ఎన్‌ ఫీల్డ్ బైక్ ఇప్పించాలని కోరామని అయితే ఇప్పటి వరకు వాటిని ఆమె కుటుంబం ఆర్ధిక పరిస్థితుల కారణంగా ఇవ్వలేకపోవడం వల్లనే చిత్రహింసలకు గురి చేశారని ఫిర్యాదులో పేర్కొంది.

వాటన్నింటిని గత నెల రోజులుగా ఎంతో సహనంతో భరిస్తూ వచ్చింది. ఈ క్రమంలో ఆమెను తన భర్త నీలి చిత్రాలు తీసేవాళ్లకు అమ్మేశాడని తెలుసుకుంది. దీంతో తెల్లవారితే ఆమెను వాళ్లు వచ్చి తీసుకెళ్తారని తెలియడంతో రాత్రికి రాత్రే తన గ్రామానికి చేరుకుంది. జరిగిన విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది. అనంతరం బాధితురాలితో కలిసి పోలీసులకు ఫిర్యాదుచేయగా కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+