వంద కేసులు: పిఎస్ నుంచి ఎమ్మెల్యే భర్త పరార్

పాట్నా: బీహార్ అధికార పార్టీ జెడియు శాసనసభ్యురాలు బీమా భారతి భర్త అవదేష్ మండల్ పోలీస్ స్టేషన్‌న నుంచి తప్పించుకుని పారిపోయాడు. అవదేష్ తప్పించుకోవడానికి బీమా భారతి, పూర్ణియా జెడియు పార్లెమంటు సభ్యుడు సంతోష్ కుష్వాహా సహకరించినట్లు ఆరోపణలు వచ్చాయి.

అవదేష్‌పై దాదాపు వంద క్రిమినల్ కేసులున్నాయి. ఓ హత్య కేసులో బెదిరించినందుకు పోలీసులు సోమవారంనాడు అవదేష్‌ను అరెస్టు చేశారు. 2005లో జరిగిన ఓ హత్య కేసులో ఆయన నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో సాక్షులను బెదరించాడని పోలీసులు చెప్పారు.

అవదేష్‌ను అరెస్టు చేసిన కొన్ని గంటలకు ఆయన భార్య బీమా భారతి, సంతోష్ 150 మందికి పైగా అనుచరులతో మరంగ పోలీసు స్టేషన్‌కు వచ్చారు. ఎంపి పోలీసులతో మాట్లాడుతుండగా బీమా భారతి పోలీసు స్టేషన్ ఎదుట తన వాహనంలో కూర్చుకున్నారు.

 Bihar MLA helps husband flee from police station

రాత్రి ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో ఆ సంఘటన జరిగింది. తనపై జరిగిన దాడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరడంతో అవదేష్ మండల్‌కు వేసిన సంకెళ్లను తొలగించారు. ఎంపి పోలీసుల మాట్లాడుతుండగా అవదేష్ వారి కళ్లుగప్పి పారిపోయి ఎమ్మెల్యే వాహనంలో కూర్చుని ఉడాయించాడు. కాసేపటికి సంతోష్ కూడా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. భారతి గతంలో మంత్రిగా కూడా పనిచేశారు.

అవదేష్ మండల్ వాహనాన్ని పలు వాహనాల్లో పోలీసులు వెంబడించారని, కానీ ఫలితం లభించలేదని చెబుతున్నారు. కొన్ని సెల్‌ఫోన్లపై పోలీసులు నిఘా కూడా పెట్టారు. కానీ ఎమ్మెల్యే, ఆమె అనుచరులు తమ స్థలాలను మారుస్తున్నట్లు తెలుస్తోంది. రాత్రంతా పోలీసులు పలు చోట్ల సోదాలు నిర్వహించారు.

అవదేష్ మండల్ పారిపోవడానికి సహకరించినవారిపై చర్యలు తీసుకుంటామని ఎడిజి (కేంద్ర కార్యాలయం) సునీల్ కుమార్ చెప్పారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు మరంగ పోలీసు స్టేషన్ ఎస్‌హెచ్ఓ శివ కుమార్‌ను సస్పెండ్ చేసినట్లు ఆయన తెలిపారు. అవదేష్‌ను మళ్లీ అరెస్టు చేస్తామని పూర్ణియా ఎస్పీ నిశాంత్ తివారీ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+