అక్కడ అమ్మాయిల మొబైల్ ఫోన్లపై బ్యాన్

తమ ఆదేశాలను ధిక్కరిస్తే అమ్మాయిల కుటుంబాలకు పెద్ద యెత్తున జరిమానా విధిస్తామని కూడా పంచాయతీ ఆదేశాలు జారీ చేసిందని గ్రామ పంచాయతీ అధిపతి భర్త జకీర్ అన్సారీ చెప్పారు. వందలాది మంది గ్రామస్థుల అభిప్రాయం తీసుకుని ఆ నిషేధం విధించినట్లు ఆయన చెప్పారు.
అమ్మాయిలు మొబైల్ ఫోన్లు వాడకుండా నిషేధం విధించే అధికారం గ్రామపంచాయీతలకు లేదని బీహార్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి భీమ్ సింగ్ చెప్పారు. అమ్మాయి గానీ, గ్రామానికి చెందిన మరెవరైనా గానీ ఫిర్యాదు చేస్తే నిషేధం విధించిన గ్రామ పంచాయతీపై చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.
ఇలాంటి నిషేధం విధించడం బీహార్‌లో ఇదే మొదటిసారి కాదు. పాఠశాల పిల్లలు సెల్ ఫోన్లు వాడకూడదని ఔరంగాబాద్ జిల్లాలోని ఓ గ్రామ పంచాయతీ ఇదివరకు నిషేధం విధించింది. అదే విధంగా రెచ్చగొట్టే దుస్తులు ధరించవద్దని కూడా ఆదేశించింది.












Click it and Unblock the Notifications