ఆడవాళ్లు అసూయపడేలా ! ఆమె కాదు అతడు
పాట్నా: ఆడవాళ్లు అసూయపడేలా జడలో పూలు, మెడలో నగలు వేసుకుని, పెదాలకు లిఫ్ స్టిక్, బుగ్గలకు మేకప్, వయ్యారంగా చీరకట్టుకుని అందంగా తయారై నకిలీ పత్రాల రాకెట్ నిర్వహిస్తున్న వ్యక్తిని బీహార్ పోలీసులు పట్టుకున్నారు. ఆమె కాదు అతను అని తెలుసుకున్న పోలీసులు సైతం షాక్ కు గురైనారు.
మోనికా అలియాస్ అవినాష్ ను పట్టుకుని విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. అవినాష్ అచ్చంగా ఆడవాళ్లు ఎలా ఉంటారో అలాగే తయారైనాడు. తరువాత ఆధార్ కార్డులుతో సహ పదో తరగతి, డిగ్రీ, పీజీ, బీఈడీ, డిప్లమా, ఐటీఐ, జేఈ తదితర నకిలీ సర్టిఫికెట్లు సృష్టిస్తున్నాడు.

ఓ ముఠా ఏర్పాటు చేసుకుని ఆ నకిలీ పత్రాలు ఇవ్వడానికి రూ. 500 నుంచి రూ. 25 వేల వరకు తీసుకుంటున్నారు. మోనికా ఆడది కాదు అతను అని ఓ యువతి పాట్నా పోలీసులకు సమాచారం ఇచ్చింది. నకిలి పత్రాలు సృష్టిస్తున్న కేడీ మోనికాను పోలీసులు పట్టుకున్నారు.
ఆమె గెటప్ చూసిన పోలీసులు షాక్ కు గురైనారు. విగ్ తీసి చూడగా అవినాష్ అలియాస్ గోల్టీ అసలు స్వరూపం బయటపడింది. వెంటనే అతనికి సహకరిస్తున్న ముఠాను పట్టుకున్నారు. వారిని విచారిస్తున్న కొద్ది వారి అక్రమ దందాలు బయటపడుతున్నాయని పోలీసులు చెప్పారు.
బీహార్ లో సంపూర్ణ మద్యనిషేదం అమల్లో ఉంది. అయితే ఈ ముఠా ఎంత మద్యం కావాలన్నా నిమిషాల్లో సరఫరా చేస్తున్నదని పోలీసులు తెలిపారు. విదేశాలకు వెళ్లాలనుకునే యువతను లక్షంగా చేసుకుని అవినాష్ ఈ రాకెట్ నడుపుతున్నాడని పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications