కొత్త శాఖలు సమానంగా: ముఖ్యమంత్రి వద్దే హోమ్: బీజేపీకి ఝలక్: ఫైనాన్స్‌తో సరి
పాట్నా: బిహార్‌లో కొత్తగా కొలువు తీరిన మంత్రులకు శాఖలను కేటాయించారు. ఈ మేరకు గవర్నర్ ప్రధాన కార్యదర్శి చైతన్య ప్రసాద్ కొద్దిసేపటి కిందటే నోటిఫికేషన్‌ను జారీ చేశారు. కీలకమైన శాఖలను ఎన్డీఏ మంత్రులకు ఇవ్వలేదని చెబుతున్నారు. ఒక్క ఆర్థికశాఖను మాత్రమే భారతీయ జనతా పార్టీకి ఇచ్చారు. కమలనాథులు ఆశించిన విధంగా శాఖల పంపకాలు చోటు చేసుకోలేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. శాఖల కేటాయింపులో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సమతౌల్యాన్ని కనపర్చలేదని చెబుతున్నారు.
సొంత పార్టీ జనతాదళ్ (యునైటెడ్), బీజేపీ, వికాస్ శీల్ ఇన్సాఫ్ పార్టీ, హిందుస్తానీ ఆవామ్ మోర్చాలకు శాఖల కేటాయింపులో సమానత్వం లేదనే విమర్శలు ఉన్నాయి. ముఖ్యమంత్రి తరువాత ఆ స్థాయిలో ప్రాధాన్యత ఉండే శాఖలు హోమ్, ఆర్థికం. ఈ రెండింట్లో ఒకటి తన వద్దే ఉంచుకున్నారు ముఖ్యమంత్రి నితీష్ కుమార్. హోమ్ శాఖను ఎవరికీ కేటాయించలేదు. స్వయంగా ఆయనే పర్యవేక్షిస్తారు. ఆర్థికశాఖను బీజేపీకి కేటాయించారు.

బీజేపీ తరఫున ఉప ముఖ్యమంత్రిగా నియమితులైన తార్ కిషోర్ ప్రసాద్‌కు ఆర్థికశాఖను అప్పగించారు. పరిశ్రమలు, పంచాయతీ రాజ్ శాఖలను బీజేపీకే చెందిన మరో డిప్యూటీ సీఎం రేణూ ప్రసాద్‌కు ఇచ్చారు. శాఖల కేటాయింపు ఇలా ఉంది: నితీష్ కుమార్- సాధారణ పరిపాలన, హోమ్, మంత్రివర్గ వ్యవహారాలు, విజిలెన్స్, ఎవరికీ కేటాయించని ఇతర శాఖలు, తార్ కిషోర్ ప్రసాద్-ఆర్థికం, వాణిజ్యం, పన్నులు, పర్యావరణం, అడవులు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ, పట్టణాభివృద్ధి, రేణూదేవి-పంచాయతీ రాజ్, వెనుకబడిన వర్గాల సంక్షేమం, పరిశ్రమలు ఇచ్చారు.
విజయ్ కుమార్ చౌధరీ-గ్రామీణాభివృద్ధి, శాసనసభా వ్యవహారాలు, జల వనరులు, సమాచార శాఖలు, బిజేంద్ర ప్రసాద్ యాదవ్-విద్యుత్, ఎక్సైజ్, ప్రణాళిక అభివృద్ధి, పౌర సరఫరాలు, అశోక్ చౌధరీ-భవన నిర్మాణాలు, మైనారిటీ సంక్షేమం, మేవాలాల్ చౌధురి-విద్య, శీలా కుమారి-రవాణా, సంతోష్ కుమార్ సుమన్-చిన్నతరహా నీటి ప్రాజెక్టులు, ఎస్సీ, ఎస్టీ సంక్షేమం, ముఖేష్ సహనీ-పశు, పాడిపరిశ్రమాభివృద్ధి, మత్స్య శాఖ, మంగళ్ పాండే-వైద్య, ఆరోగ్యం, సాంస్కృతికం, యువజన సర్వీసులు, రోడ్ల నిర్మాణం, అమరేంద్ర ప్రతాప్ సింగ్-వ్యవసాయం, సహకార శాఖ, చెరకు అభివృద్ధి, డాక్టర్ రామ్ ప్రీత్ పాశ్వాన్-కమ్యూనిటీ హెల్త్ మిషన్లు, జీవన్ కుమార్-కార్మిక శాఖ, పర్యాటకం, గనులు, రామ్ సూరత్ కుమార్-రెవెన్యూ శాఖలను కేటాయించారు.
Recommended Video
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications