కరోనా ఎఫెక్ట్‌తో భారీగా బ్యాలెట్లు: లీడ్‌లో యాదవ్ బ్రదర్స్: పోటాపోటీగా: మేజిక్ ఫిగర్‌కు దూరం

పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా పెద్ద ఎత్తున బ్యాలెట్ పత్రాలను వినియోగించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అనేక నియోజకవర్గాల్లో బ్యాలెట్ పత్రాల ద్వారా ఓటింగ్‌ను నిర్వహించారు. కౌంటింగ్ సందర్భంగా బ్యాలెట్ పత్రాల లెక్కింపును మొదటగా ఆరంభించారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో నిక్షిప్తమై ఉన్న ఓట్లను లెక్కించడానికి ఇంకా సమయం ఉంది. బ్యాలెట్ పత్రాల లెక్కింపు పూర్తయిన తరువాతే ఈవీఎంలను తెరుస్తారు.

ప్రారంభ ఫలితాల్లో ఆర్జేడీ నేతృత్వంలోని మహాకూటమి ఆధిక్యాన్ని సాధించింది. మ్యాజిక్ ఫిగర్ వైపు దూసుకెళ్తోంది. 243 స్థానాలు ఉన్న బిహార్ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 122 స్థానాలు అవసరం అవుతాయి. ఆ దిశగా ఆర్జేడీ ముందంజలో ఉంది. ఆ వెనుకే ఎన్డీఏ ఉంది. ఇప్పటిదాకా మొత్తం 104 స్థానాలకు సంబంధించిన తొలి ఫలితాలు వెలువడగా.. మహాకూటమి-51, ఎన్డీఏ-49, లోక్‌ జన్‌శక్తి పార్టీ-1, ఇతరులు మూడు స్థానాల్లో ఆధిక్యతలో కొనసాగుతున్నారు.

Bihar present trends are solely postal ballots, the ream EVM numbers will start around 9 am

పార్టీలవారీగా చూసుకుంటే బీజేపీ-28, ఆర్జేడీ-33, జేడీయూ-21, ఎల్జేపీ-1, కాంగ్రెస్-11, సీపీఎం ఎంఎల్-4, సీపీఎం-2, ఇతరులు నాలుగు చోట్ల ఆధిక్యతను ప్రదర్శిస్తున్నారు. మహాకూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఆధిక్యతలో ఉన్నారు. రాఘోపూర్ నుంచి ఆయన పోటీ చేశారు. హసన్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్ తన సమీప ప్రత్యర్థిపై ఆధిక్యతను సాధించారు.

Recommended Video

    Bihar polls: Counting of votes begins for 243 Assembly constituencies

    ఈవీఎంల ద్వారా వెలువడే ఫలితాల ప్రభావం మరోరకంగా ఉండొచ్చని భావిస్తున్నప్పటికీ. ఇప్పుడున్న మెజారిటీనే కొనసాగుతుందనే అబిప్రాయాలూ కూడా ఉన్నాయి. ఇదే ట్రెండ్ చివరి వరకూ కొనసాగితే.. హంగ్ అసెంబ్లీ ఏర్పడటం ఖాయంగా కనిపిస్తోంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన 122 స్థానాలు ఏ పార్టీకీ లభించకపోవచ్చు. మెజారిటీకి కొద్దిదూరంలో ఆగిపోవడానికే అవకాశం ఉన్నట్లు ప్రారంభ ఫలితాలు సూచిస్తున్నాయి.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+