గతంలో బికినీ మహిళ: ఇప్పుడు బీఈడీ విద్యార్థి హాల్ టికెట్‌పై అమితాబ్ ఫొటో!
లక్నో: ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు చెందిన పలు యూనివర్సిటీల నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తాజాగా, ఉత్తరప్రదేశ్‌లోని ఫైజాబాద్‌లోని డాక్టర్ రామ్ మనోహర్ లోహియా విశ్వవిద్యాలయ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఓ విద్యార్థి హాల్ టికెట్‌పై ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ఫొటో ప్రచురితమైంది.

కాలేజీ నిర్లక్ష్యం.. విద్యార్థిపైనే ఆరోపణ
బీఈడీ విద్యార్థి అయిన అమిత్ ద్వివేది పరీక్ష రాయాల్సి ఉండగా దీనికి సంబంధించిన హాల్ టికెట్‌ను విశ్వవిద్యాలయ అనుబంధ రవీంద్ర సింగ్ స్మారక్ మహా విద్యాలయ సిబ్బంది సోమవారం జారీ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని గోండా జిల్లాలో ఉన్న ఈ కాలేజీ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఈ పొరపాటు జరిగింది. అయితే, విద్యార్థి తప్పిదమేనంటూ కాలేజీ యాజమాన్యం తప్పించుకునేందుకు ప్రయత్నించడం గమనార్హం.

ఇబ్బందులు ఎదుర్కొన్నా..
‘నేను నా ఫొటో అతికించే పరీక్ష దరఖాస్తు నింపాను. కానీ, హాల్ టికెట్‌లో నా ఫొటోకు బదులు బిగ్ బీ ఫొటో రావడం చూసి షాక్ అయ్యాను. దీని వల్ల పరీక్ష రాయడానికి చాలా ఇబ్బంది ఎదుర్కొవాల్సి వచ్చింది' అని అమిత్ వాపోయాడు.

మార్కుల లిస్టు కూడా ఇలానే వస్తే..
‘మరికొన్ని అదనపు ధృవపత్రాలు యాజమాన్యానికి సమర్పిస్తే గానీ నన్ను పరీక్ష రాయడానికి అనుమతించలేదు. ఇప్పుడు నా మార్కుల లిస్ట్ కూడా ఇలాగే వస్తుందేమోనని భయంగా ఉంది' అని అమిత్ ఆందోళన వ్యక్తం చేశాడు.

గతంలో హాల్ టికెట్‌పై బికినీ మహిళ
కాగా, గతంలో కూడా యూపీ, బీహార్‌కు చెందిన పలు యూనివర్సిటీలు, కాలేజీలు ఇలాగే నిర్లక్ష్యంగా వ్యవహరించాయి. ఏప్రిల్ 2018లో బీహార్‌కు చెందిన ఓ విద్యార్థికి సంబంధించిన హాల్ టికెట్‌పై బికినీలో ఉన్న మహిళ ఫొటోను ముద్రించారు. దీంతో దిగ్భ్రాంతికి గురైన సదరు విద్యార్థి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో దాన్ని వెంటనే కరెక్ట్ చేసి ఇవ్వడం జరిగింది. యూనివర్సిటీ నిర్లక్ష్యం కారణంగానే ఈ తప్పిదం జరిగిందని కాలేజీ యాజమాన్యం ఆరోపించగా.. ఇందుకు బాధ్యత వహిస్తూ హాల్ టికెట్ ముద్రించిన సంస్థ సదరు విద్యార్థికి క్షమాపణలు చెప్పింది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications