పందింట్లోనే వరుడికి షాకిచ్చిన వధువు, ట్విస్టిచ్చిన ప్రియుడు, రద్దైన పెళ్ళి
లక్నో: కొన్ని క్షణాల్లో వివాహం జరగాల్సి ఉండగా పెళ్ళి పందిట్లో బంధువులు వివాహ తంతు కోసం ఎదురుచూస్తున్నారు. అయితే సినిమాలో చూపినట్టుగానే ఓ యువకుడు బైక్‌పై పూలదండతో వచ్చి పెళ్ళి పందిలో కూర్చొన్న వధువు మెడలో దండను వేశాడు. వధువు కూడ పందిరి నుండి కిందకు దిగి తాను కూడ ఆ యువకుడి మెడలో దండ వేసింది. దీంతో పెళ్ళికి వచ్చినవారితో పాటు రెండు కుటుంబాల పెద్దలు షాక్ తిన్నారు.
పెళ్లిళ్ళ విషయాల్లో యువతి, యువకులు తమకు ఇష్టమున్న వారిని పెళ్ళి చేసుకొనే స్వేచ్ఛ ఇవ్వకపోతే కొన్ని ఇబ్బందులు తప్పవు. ఇదే తరహా ఘటన ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకొంది.
చదువుకొనే సమయంలో ప్రేమించుకొన్న ఇద్దరు యువతి యువకుల వివాహానికి వధువు తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దీంతో పెళ్ళి పందిట్లోనే సినిమాలో హీరోగా ప్రియుడు చేసిన పనికి వధువు తరుపు బంధువులు అతడిని చితక్కొట్టారు.అయితే ప్రియుడిని పోలీసులు రక్షించారు.

అచ్చు సినిమా తరహలోనే
ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని బిజ్‌నోర్ జిల్లా నాగినాలో అచ్చు సినిమా తరహలోనే ఓ ఘటన చోటు చేసుకొంది. కొన్ని క్షణాల్లో వధువు మెడలో వరుడు తాళి కట్టాల్సి ఉంది. ఆ సమయం కోసం పెళ్ళి వేడుకను తిలకించేందుకు పెద్ద ఎత్తున మండపానికి బంధువులు, స్నేహితులు వచ్చారు. అయితే అదే సమయంలో వధువును ప్రేమించిన యువకుడు బైక్‌పై వచ్చి వధువు మెడలో పూలదండను వేశాడు. వధువు కూడ పెళ్ళి మండపం దిగి ప్రియుడి మెడలో దండ వేసింది. దీంతో పెళ్ళి పందిట్లో ఉన్నవారంతా షాక్‌కు గురయ్యారు.

పెళ్ళికి ఒప్పుకోనందుకే
వధువు, వరుడు ఒకే కాలేజీలో చదువుకొన్నారు. ఆ సమయంలో వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అయితే వీరిద్దరి కులాలు వేరు కావడంతో పెళ్ళికి అంగీకరించలేదు. దీంతో ఏం చేయాలో తోచక ప్రియుడు ఇలా చేశాడు. వధువు పెళ్ళి పీటలపై ఉన్న సమయంలోనే ఆమెపై దండ వేస్తే అందరి దృష్టిని ఆకర్షించవచ్చని భావించాడు. అనుకొన్నదే తడవుగా తన ప్లాన్‌ను అమలు చేశాడు. ప్రియుడిపై తనకున్న ప్రేమను అతడి మెడలో దండ వేసి వధువు వ్యక్తం చేసింది

పెళ్ళి క్యాన్సిల్
పెళ్ళి పందింట్లో వధువు మెడలో ప్రియుడు బైక్‌పై వచ్చి పూల దండ వేయడంతో వరుడి తరుపు కుటుంబసభ్యులు ఈ వివాహన్ని రద్దు చేసుకొన్నారు. వదువుకు వేరే యువకుడితో ప్రేమ వ్యవహరం ఉన్న విషయాన్ని బహిరంగంగానే అంగీకరించడంతో వివాహాన్ని రద్దు చేసుకొన్నారు. ఈ విషయాన్ని పెళ్ళికి ముందే చెబితే బాగుండేదని వరుడి కుటుంబసభ్యులు వధువు తరుపు బంధువులను నిలదీశారు. పెళ్ళిని రద్దు చేసుకొన్నారు.

ప్రియుడిని కొట్టిన బంధువులు
పెళ్ళి పందిట్లోనే వధువుపై పూలదండ వేసిన ప్రియుడిని వధువు బంధువులు కుటుంబసభ్యులు చితక్కొట్టారు. హీరోయిజం ప్రదర్శించేందుకు వచ్చిన ప్రియుడు చావు దెబ్బలు తిన్నాడు. అయితే ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు అందడంతో ప్రియుడిని రక్షించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications