Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వీడియో వైరల్: బైకుపై ఇద్దరు..ఎదురుగా సింహం, ఏం జరిగిందో చూడండి

Recommended Video

    Viral Video : Lioness & Her Cubs Make Way For Biker In Gujarat

    గుజరాత్: గుజరాత్ గిర్ అడవులు సింహాలకు ఫేమస్. అక్కడ నిత్యం సింహాలు ఒక గుంపులో సంచరిస్తూనే ఉంటాయి. సింహాలు సంచరిస్తున్న పలు వీడియోలు కూడా బయటపడ్డాయి. ఇక ఈ సింహాలను చూసేందుకు చాలామంది జంతుప్రేమికులు ఈ అడవుల సమీపంవరకు వెళతారు. తాజాగా సింహాల గుంపు వెళుతున్న ఓ వీడియో సోషల్ మీడియాను చుట్టేస్తోంది.

    గిర్ జాతీయ పార్కులో అప్పటి వరకు నడిరోడ్డుపై ఉన్న సింహం ఒక్కసారిగా లేచి నడుస్తూ వెళుతుండగా దాని వెనక తన రెండు సింహం పిల్లలు ఫాలో అయ్యాయి. అలా వెళుతుండగా ఎదురుగా బైకుపై ఇద్దరు వ్యక్తులు వచ్చారు. సింహాలను చూసి ఒక్కసారిగా బైకును ఆపేశారు. వీరికి భూమిపై నూకలు ఇంకా మిగిలే ఉండటంతో ఆ సింహం దాడి చేయలేదు.

    పైగా తాను అడ్డంగా వచ్చానని తెలుసుకుందో ఏమో తెలియదుగానీ ఈ బైకుపై వెళ్లే వారికి దారి ఇచ్చింది. అంటే ఈ సింహం పక్కకు తప్పుకుని గడ్డిలోకి వెళ్లిపోయింది. ఇక ఈ వీడియోను రాజ్యసభ ఎంపీ పరిమాల్ నత్వానీ ట్విటర్‌లో పోస్టు చేయడంతో వీడియో వైరల్ అయ్యింది. అంతేకాదు మనుషులను సింహాలు గౌరవించడం అనేది చాలా అద్భుతం అని ఆయన పోస్టులో రాసుకొచ్చారు.

    ఇక వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో 80వేల మంది వీక్షించారు. నెటిజెన్ల నుంచి తమదైన శైలిలో కామెంట్లు వచ్చాయి. ఇద్దరి వ్యక్తులకు సింహం ఎదురుగా వచ్చి వారిని ప్రాణాలతో వదిలేయడం నిజంగా వారి అదృష్టం అని కొందరు ట్వీట్ చేస్తే మరికొందరు మాత్రం వన్య ప్రాణులను మనిషి గౌరవించాలంటూ రాసుకొచ్చారు. మరికొందరు మాత్రం గిర్ అడవుల్లో నివసించే సింహాలు మనుషులపై దాడులు చేయవని ఇలా మనుషులు ప్రాణాలతో తిరిగి వచ్చిన ఘటనలు చాలా ఉన్నాయని రాసుకొచ్చారు.

    Bike borne men faces Lioness and cubs in Gir forest, see what happens next

    సింహాలు తమపై దాడి చేయకుండా పక్కకు తప్పుకోవడాన్ని ఊపిరి బిగపట్టి అనుభవించిన ఇద్దరు వ్యక్తులు ఆ సింహం పక్కకు వెళ్లగానే ఊపిరి పీల్చుకున్నారు. ఒకవేళ బైకు హారన్ కొట్టినా... దాన్ని బెదిరించే ప్రయత్నం చేసిన పరిస్థితి మరోలా ఉండేదని వీడియోను చూసిన చాలామంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా సింహంకు మనిషి ఎదురుపడితే అది వదలదని కానీ వీరు మాత్రం చాలా లక్కీ అని కొందరు ట్వీట్ చేశారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+