పెట్రోల్ బంకులో బైకులో చెలరేగిన మంటలు..సీసీ కెమెరాలో రికార్డయిన దృశ్యాలు

తమిళనాడు: తమిళనాడులో ఓ పెట్రోల్ బంకులో బైకు నుంచి హఠాత్తుగా మంటలు చెలరేగాయి. అదృష్టవశాత్తు బైకుపై ఉన్న వ్యక్తి గాయాలతో బయటపడ్డాడు. వివరాల్లోకి వెళితే పెట్రోల్ బంకులో తన బైకుకు పెట్రోల్ నింపుకునేందుకు ఓ వ్యక్తి వెళ్లాడు. బైకులో పెట్రోల్ నింపాల్సిందిగా అక్కడి పనిచేసే సిబ్బందిని కోరాడు. పెట్రోల్ ఫుల్ ట్యాంక్ పట్టించాడు. ఫుల్ ట్యాంక్ పట్టించాకా... డబ్బులు చెల్లించి ఇక ఆయన పనిపై వెళ్లేందుకు బైకును స్టార్ట్ చేశాడు. అంతే ఒక్కసారిగా బైకు నుంచి మంటలు చెలరేగాయి.

బైకు నుంచి మంటలు చెలరేగడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు అక్కడి వారు. వెంటనే అక్కడి నుంచి పరుగులు తీశారు. బైకుపై ఉన్న వ్యక్తికి మంటలు అంటుకున్నాయి. దీంతో బండిపై నుంచి పరుగులు తీశాడు వ్యక్తి. మంటలార్పి అతన్ని తిరునేల్వేలి హాస్పిటల్‌లో చికిత్స కోసం తరలించారు. అయితే తీవ్రగాయాలు అయినట్లు వైద్యులు తెలిపారు. మంటలు అంటుకున్న వ్యక్తిని అల్విన్‌గా గుర్తించారు. ఈ ఘటన పాలయంకొట్టాయ్‌లో జరిగింది. బైకు పెట్రోల్ ట్యాంకు పూర్తిగా నిండటంతో పెట్రోల్ బయట పడ్డట్లు తెలుస్తోంది. బైకు స్టార్ట్ అవ్వగానే మంటలు చెలరేగినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చారు.

Bike catches fire in tamilnadu petrol pump, man injured

ఇదిలా ఉంటే అల్విన్ రూ.వెయ్యి పెట్రోల్ పట్టాల్సిందిగా సిబ్బందిని కోరాడు. అయితే రూ.900 విలువ చేసే పెట్రోల్... ట్యాంకులో పడగానే ట్యాంకు నిండిపోయింది. ఇది గమనించని సిబ్బంది అలానే పెట్రోల్ పట్టడంతో ట్యాంకు నుంచి పెట్రోల్ బయటకు పొర్లింది. వెంటనే బైక్ స్టార్ట్ చేయడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ దృశ్యాలన్నీ అక్కడే అమర్చిన సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+