నాలుగు రోజుల్లో పెళ్ళి....అంతలోనే ఘెరం జరిగింది.

హోసూర్. (బెంగుళూరు). : నాలుగు రోజుల్లో వివాహం.....వివాహానికి తన సన్నిహితులను, బందువులను పిలిచేందుకు తానే సిద్దమయ్యారు. అందరికీ తానే ఆహ్వాన పత్రికలు పంచుతున్నాడు. మిగిలిన వారికి కూడ ఆహ్వాన పత్రికలను పంచేందుకు వెళ్ళి రోడ్డు ప్రమాదంలో మరణించాడు. కర్ణాటక రాష్ట్రంలోని హోసూర్ లో ఈ విషాదకరమైన ఘటన చోటు చేసుకొంది.

నాలుగు రోజుల్లో పెళ్ళి ఉంది...పెళ్ళి కి అన్నిరడీ చేస్తున్నారు. పెళ్ళికి బందు మిత్రులను పిలిచే పనిలో ఉన్నారు రెండు కుటుంబాల వారు. పెళ్ళి కొడుకు 25 ఏళ్ళ మంజు మాత్రం ఆహ్వాన పత్రికలను పంచే పనిలో బిజీగా ఉన్నారు. ఆహ్వాన పత్రికలు పంచే క్రమంలో బందువుల ఇంటికి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో మరణించడం రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది.మంజు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

bike crash man died in karnataka state

ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మంచునాయకనపల్లి గ్రామానికి చెందిన సుధతో హొసూర్ కు సమీపంలోని కుంబకం గ్రామానికి చెందిన 25 ఏళ్ళ మంజుతో వివాహాం కుదిరింది.బందువులకు ఆహ్వాన పత్రికలను పంచేందుకు శూలగిరి వైపు ద్విచక్ర వాహానం పై వెళ్తుండగా ఎదురుగా వేగంగా వచ్చిన కారు డీకొట్టింది.ఈ ప్రమాదంలో మంజు అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటనతో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

నాలుగు రోజుల్లో పెళ్ళి చేసుకోని సంతోషంగా ఉండాల్సిన మంజు...ప్రమాదానికి గురై మరణించడంతో కుటుంబసభ్యులు సాక్ కు గురయ్యారు. అమ్మాయి కుటుంబసభ్యులు కూడ ఈ హఠాత్ పరిణామానికి దిగ్భ్రాంతికి లోనయ్యారు.ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+