బిల్ గేట్స్‌కు 2017లో నచ్చిన సినిమా ఏదంటే...

న్యూఢిల్లీ: ఈ ఏడాది విడుదలైన సినిమాల్లో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ నటించిన 'టాయిలెట్ : ఏక్ ప్రేమకథ' తనకు ఎంతగానో నచ్చిందని మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కొనియాడారు. సానుకూల అంశాలతో సంవత్సరాన్ని ముగిస్తున్నట్టు ఆయన తెలిపారు.

2017లో జరిగిన పలు స్ఫూర్తివంతమైన సందర్భాలను ఆయన ట్విటర్ ద్వారా పంచుకున్నారు. వాస్తవానికి 2017 చాలా కఠినమైన సంవత్సరమే అయినప్పటికీ మన నమ్మకాన్ని, ప్రగతిని ప్రోత్సహించే అనేక అద్భుత క్షణాలను అందించిందని అన్నారు.

ప్రత్యేకంగా భారత్‌లో సంభవిస్తున్న పది మరణాల్లో ఒక మరణానికి కారణమైన అపరిశుభ్రత అనే సంక్షోభంపై ఆ సినిమా ప్రేక్షకుల్లో అవగాహన నింపిందని అన్నారు.

 Bill Gates is impressed with 'Toilet: Ek Prem Katha'

టాయిలెట్: ఏ లవ్ స్టోరీ చిత్రం కొత్తగా పెళ్లైన జంట గురించే అయినప్పటికీభారతదేశంలో పారిశుద్ధ్య సవాలుపై ప్రేక్షకులను ఆలోచింపజేసిందని ఆయన అభిప్రాయపడ్డారు.

జీవితంలో జరిగిన ఓ సంఘటన ఇతివృత్తంగా టాయిలెట్ : ఏక్ ప్రేమకథ సినిమా తెరకు ఎక్కింది. ఈ సినిమాలో అక్షయ్ కుమార్, భూమి పడ్నేకర్ నటించారు. కొత్తగా పెళ్లైన ఓ యువతి భర్త ఇంట్లో మరుగుదొడ్డి లేని కారణంగా పుట్టింటికి వెళ్లిపోవడం, భర్త టాయిలెట్ కట్టించి మళ్లీ ఆమెను కాపురానికి తీసుకురావడం సన్నివేశాలు ఈ చిత్రంలో ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+