రద్దయిన నోట్లు ఉంటే శిక్షే... బిల్లు ప్రవేశపెట్టిన అరుణ్ జైట్లీ
మీ వద్ద రద్దు చేసిన పాత రూ.1000, రూ.500 నోట్లు ఉన్నాయా? అయితే మీకు శిక్ష తప్పదు. రద్దయిన నోట్లు కలిగి ఉండడాన్ని ఇక మీదట నేరంగా పరిగణిస్తారు.
న్యూఢిల్లీ: మీ వద్ద రద్దు చేసిన పాత రూ.1000, రూ.500 నోట్లు ఉన్నాయా? అయితే మీకు శిక్ష తప్పదు. రద్దయిన నోట్లు కలిగి ఉండడాన్ని ఇక మీదట నేరంగా పరిగణిస్తారు. దీనికి కనీసం రూ.10 వేలు లేదంటే దొరికిన రద్దయిన నోట్ల విలువకు ఐదు రెట్లు జరిమానా విధిస్తారు.
గత డిసెంబర్ 30న ఈ నోట్లపై కేంద్రం ఆర్డినెన్స్ జారీ చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ శుక్రవారం దీన్ని బిల్లు రూపంలో లోక్ సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ఉభయ సభల్లో ఆమోదం పొంది చట్టంగా మారాల్సి ఉంది.

భారత ఆర్థిక వ్యవస్థలోని నల్లధనాన్ని వెలికితీయడం కోసం రిజర్వ్ బ్యాంక్ కేంద్రీయ బోర్డు సిఫార్సు మేరకు ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రూ.1000, రూ.500 నోట్ల రద్దుకు నిర్ణయం తీసుకున్నట్టుగా బిల్లులో పేర్కొన్నారు.
ఇది గనుక చట్టరూపం దాల్చిందంటే.. ఆ తరువాత రద్దయిన పాత నోట్లు కలిగి ఉండడం చట్టరీత్యా నేరం అవుతుంది. అయితే ఈ బిల్లు చట్ట వ్యతిరేకమని విపక్ష పార్టీలన్నీ కేంద్ర ప్రభుత్వంపై మండిపడుతున్నాయి.












Click it and Unblock the Notifications