ఉపాధి హామీ పథకానికి సమాధి కడుతున్న కేంద్రం?

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA) 2005ను రద్దు చేయడానికి రంగం సిద్ధం చేసింది. ఇటీవలే ఈ పథకం పేరును మార్చిన కేంద్ర సర్కార్.. మరో అడుగు ముందుకు వేయబోతోంది. ఏకంగా దీన్ని రద్దు చేయబోతోంది. దీనికి సంబంధించిన బిల్లును సైతం రూపొందించింది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం రద్దు బిల్లును ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

అదే సమయంలో ఈ పథకం స్థానంలో మరో సరికొత్త గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. దీనికి పేరును కూడా ఖరారు చేసినట్లు చెబుతున్నారు. "వికసిత్ భారత్-గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్) (VB-G RAM G) బిల్, 2025" పేరుతో ఈ మేరకు ముసాయిదా ప్రతిపాదనలను రూపొందించినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. రేపో మాపో ఈ బిల్లు పార్లమెంట్ ఉభయసభల్లో ప్రవేశపెట్టనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

Bill to repeal MGNREGA and introduce fresh rural employment framework say sources

ఈ ప్రతిపాదిత చట్టం "వికసిత్ భారత్ 2047" జాతీయ లక్ష్యాలకు అనుగుణంగా గ్రామీణాభివృద్ధికి ఒక పటిష్టమైన ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించాలనేది దీని ముఖ్య ఉద్దేశంగా చెబుతున్నారు. ఈ బిల్లు ప్రకారం- ప్రతి ఆర్థిక సంవత్సరంలో 125 రోజులపాటు గ్రామీణులకు వేతన ఉపాధిని అందించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా స్వచ్ఛందంగా ముందుకు వచ్చే ప్రతి గ్రామీణ కుటుంబంలోని వయోజనులకు చట్టబద్ధమైన ఉపాధి హామీ లభిస్తుందిజ.

ఈ బిల్లు ప్రతిపాదనలకు సంబంధించిన కాపీలను ఇప్పటికే లోక్‌సభ సభ్యులకు పంపిణీ చేసినట్లు అధికార వర్గాలు ధృవీకరించాయి కూడా. ప్రస్తుత పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే దీన్ని సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉందని సమాచారం. డిసెంబర్ 1న ప్రారంభమైన ఈ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 19వ తేదీన ముగియనున్నాయి. ఈ లోపే ఈ బిల్లు లోక్ సభ, రాజ్యసభల సమక్షానికి రావడం ఖాయంగా కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+