Birthday: కొత్త డ్రెస్ కే దిక్కులేదు, నీకు లవ్ ఎందుకురా ?, ప్రియుడి ఇంట్లో బర్త్ డే రోజు అమ్మాయి !

బెంగళూరు: అమ్మాయి, అబ్బాయి ప్రేమించుకని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. పెద్దలు పెళ్లికి అంగీకరించకపోవడంతో ఇద్దరూ లేచిపోయి పెళ్లి చేసుకున్నారు. పోలీసులు ప్రేమికులను పట్టుకుని అమ్మాయిని ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రియుడి మీద కేసు పెట్టి అతన్ని అరెస్టు చేశారు. బెయిల్ మీద బయటకు వచ్చిన ప్రియుడు మళ్లీ ఆమెను పిలుచుకుని వెళ్లి కాపురం పెట్టారు. తన బర్త్ డే రోజు కొత్త డ్రెస్ తీసివ్వాలని ప్రియురాలు ఆమె ప్రియుడికి చెప్పింది. కరోనా వైరస్ లాక్ డౌన్ దెబ్బతో షాపులు మూసేశారని, తరువాత కొత్త పంజాబి డ్రెస్ తీసిస్తానని ఆమె ప్రియుడు చెప్పాడు. తన బర్త్ డే రోజు కొత్త డ్రెస్ తీసివ్వలేని నీకు ప్రేమ, పెళ్లి ఎందుకురా ధరిద్రుడా అంటూ కోపంతో ప్రియురాలు అతని రూమ్ లో ఆత్మహత్య చేసుకుందని వెలుగు చూసింది. మా అమ్మాయి మీద మోజు తీరిపోయిన తరువాత ప్రియుడే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని అమ్మాయి కుటుంబ సభ్యులు పోలీసు కేసు పెట్టారు.

16 ఏళ్ల వయసు

16 ఏళ్ల వయసు

కర్ణాటకలోని చిక్కబళ్లాపురం జిల్లా గుడిబండలో (ఆంధ్రప్రదేశ్ సరిహద్దు)లో మహదేవ అలియాస్ మణి అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఇదే ఊరిలో నివాసం ఉంటున్న రాజు అనే వ్యక్తి కుమార్తె 16 ఏళ్ల అమ్మాయి, మహదేవ ప్రేమించుకున్నారు. ఆ అమ్మాయి 9వ తరగతి చదువుతోంది. ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించారు. ఒక సంవత్సరం పాటు ఇద్దరూ కలిసి చట్టాపట్టాలు వేసుకుని తిరిగేశారు.

 వాడు కేటుగాడు.... .వాడితే పెళ్లికి ఒప్పుకోము

వాడు కేటుగాడు.... .వాడితే పెళ్లికి ఒప్పుకోము


అమ్మాయికి ఇంకా 18 సంవత్సరాలు నిండకపోవడంతో పెళ్లి చెయ్యడానికి మహదేవ కుటుంబ సభ్యులు నిరాకరించారు. మహదేవ కేటుగాడని, పనిపాట లేకుండా వాళ్ల అమ్మానాన్న సంపాధించిన డబ్బుతో జల్సా చేస్తున్నాడని, ఈ పెళ్లికి మేము ఒప్పుకోమని ఆ అమ్మాయి కుటుంబ సభ్యులు తేల్చిచెప్పారు.

 జెండా ఎతస్తే పట్టుకుని వచ్చిన పోలీసులు

జెండా ఎతస్తే పట్టుకుని వచ్చిన పోలీసులు

గత ఏడాది మహదేవ ఆమె ప్రేమించిన అమ్మాయిని పిలుచుకుని ఇంటి నుంచి పారిపోయారు. తమ అమ్మాయి 9వ తరగతి చదువుతోందని, మాయమాటలు చెప్పి ఆమెను కిడ్నాప్ చేశారని అమ్మాయి తండ్రి రాజు మంచేనహళ్ళి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నెల రోజులు గాలించి మహదేవ, అతని ప్రియురాలిని పట్టుకున్నారు.

రెండో సారి ప్రేమికులు ఎస్కేప్

రెండో సారి ప్రేమికులు ఎస్కేప్


పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి మహదేవను అరెస్టు చేశారు. అమ్మాయిని కొంతకాలం మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారుల సమక్షంలో పెట్టి ఆమెకు బ్రేన్ వాష్ చేసి తరువాత కుటుంబ సభ్యులకు అప్పగించారు. జైలు నుంచి బయటకు వచ్చిన మహదేవ మళ్లీ ఆ అమ్మాయితో కలిసిపారిపోయాడు.

 బర్త్ డే డ్రెస్ అడిగింది

బర్త్ డే డ్రెస్ అడిగింది

కొంతకాలం బయట అమ్మాయితో కాపురం చేసిన మహదేవ తరువాత అతని ఇంటిలో కుటుంబ సభ్యును ఒప్పించి అదే ఇంటి మిద్దె మీద కాపురం పెట్టారు. కాని పెళ్లి జరగలేదని ఆమె కుటుంబ సభ్యులు అంటున్నారు. ఇంటికి రానను అని అమ్మాయి మొండికి వేయ్యడంతో ఆమెను వదిలేశారు. కొన్ని నెలల నుంచి మహదేవ అతని ఇంటి మేడ మీద అతను ప్రేమించిన అమ్మాయితో కాపురం చేస్తున్నాడు. మంగళవారం ఆ అమ్మాయి బర్త్ డే. తనకు కొత్త డ్రెస్ కావాలని ప్రియురాలు ఆమె ప్రియుడు మహదేవను అడిగింది.

 కొత్త డ్రెస్ కు దిక్కులేదు......నీకెందుకురా లవ్

కొత్త డ్రెస్ కు దిక్కులేదు......నీకెందుకురా లవ్


కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ అమలు చెయ్యడంతో షాపులు మొత్తం లాక్ చేశారని, లాక్ డౌన్ ఎత్తేసిన తరువాత బెంగళూరుకు పిలుచుకుని వెళ్లి కొత్త పంజాబి డ్రెస్ తీసిస్తానని మహేదవ ఆమె ప్రియురాలికి నచ్చచెప్పాడు. బర్త్ డేకి ప్రియురాలికి కొత్త డ్రెస్ తీసివ్వలేని నీకెందుకురా ప్రేమ, పెళ్లి అంటూ ఆ అమ్మాయి మహదేవతో గొడవ పెట్టుకునింది.

ఆత్మహత్యా ? హత్యా

ఆత్మహత్యా ? హత్యా

తనకు ఇప్పుడే కొత్త డ్రెస్ కావాలని ఆమె మొండికేసింది. ప్రియురాలితో గొడవపడిన మహదేవ మేడ మీద గదిలో నుంచి కిందకు వచ్చేశాడని తెలిసింది. తరువాత ఆ అమ్మాయి మేడ మీద గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని మహదేవ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. తమ అమ్మాయి మీద మోజు తీరిపోయిందని మహదేవ ఆమెను చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని ఆరోపిస్తూ అమ్మాయి తండ్రి రాజు పోలీసు కేసు పెట్టారు. పోలీసులు మహదేవను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+