Birthday party: ఫ్రెండ్ ఇంట్లో బర్త్ డే పార్టీ, ఉదయం శవమైన బర్త్ డే బాయ్, కేసు పెట్టిన ఆంటీ !
కోల్ కత్తా: పుట్టిన రోజు నాడు ఇంట్లో అమ్మ ఆశీర్వాదం తీసుకున్న యువకుడు స్నేహితులతో కలిసి బయటకు వెళ్లి పగలంతా హ్యాపీగా తిరిగాడు. సాయంత్రం ఇంటికి వెళ్లిన యువకుడు గంట సేపు కుటుంబ సభ్యులతో గడిపాడు. రాత్రి స్నేహితుడి ఇంటిలో బర్త్ డే పార్టీ చేసుకోవడానికి వెళ్లిన యువకుడు మరుసటి రోజు శవమైకనిపించాడు. బర్త్ డే రోజే యువకుడి ముక్కు, నోట్లు రక్తం రావడంతో తన కొడుకును అతని స్నేహితుడు హత్య చేశాడని బర్త్ డే జరుపుకున్న యువకుడి తల్లి కేసు పెట్టింది.

కొడుకు పుట్టిన రోజు
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కత్తా నగరంలోని గోల్డ్ గ్రీన్ ఏరియాలో రితేష్ మోదక్ (19) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. పుట్టిన రోజు నాడు ఇంట్లో అమ్మ ఆశీర్వాదం తీసుకున్న రితేష్ తరువాత స్నేహితులతో కలిసి బయటకు వెళ్లి పగలంతా హ్యాపీగా తిరిగాడు. సాయంత్రం ఇంటికి వెళ్లిన రితేష్ గంట సేపు కుటుంబ సభ్యులతో గడిపాడు.

ఫ్రెండ్ ఇంట్లో గ్రాండ్ గా బర్త్ డే పార్టీ
బర్త్ డే బాయ్ రితేష్ స్నేహితుడు కౌశిక్ మండల్ కోల్ కత్తాలోనే నివాసం ఉంటున్నాడు. రాత్రి స్నేహితులతో కలసి కౌశిక్ ఇంట్లో బర్త్ డే పార్టీ చేసుకుంటామని రితేష్ అతని తల్లికి చెప్పాడు. బర్త్ డే రోజు కొడుకు రితేష్ బయట తిరిగితే కరోనా వైరస్ సోకే అవకాశం ఉందని, స్నేహితుడి ఇంట్లో అయితే సంతోషంగా ఉంటారని అతని తల్లి సరే అని చెప్పింది. రాత్రి 7. 30 గంటల సమయంలో రితేష్ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. రాత్రి కౌశిక్ మండల్ ఇంట్లో రితేష్ బర్త్ డే పార్టీ చేసుకున్నాడు.

విపరీతంగా మద్యం తాగిన యువకులు
బర్త్ డే సందర్బంగా బర్త్ డే బాయ్ రితేష్ తో పాటు అతని స్నేహితులు మోతాదుకు మంచి మద్యం సేవించారని సమాచారం. అర్దరాత్రి తరువాత ఎవరిపాటికి వాళ్లు నిద్రపోయారు. మరుసటి రోజు ఉదయం బర్త్ డే బాయ్ రితేష్ శవమై కనిపించడంతో అతని స్నేహితులు షాక్ అయ్యి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

హత్య చేశారని కేసు పెట్టిన తల్లి
రాత్రి స్నేహితుడి ఇంటిలో బర్త్ డే పార్టీ చేసుకోవడానికి వెళ్లిన రితేష్ మరుసటి రోజు శవమైకనిపించడంతో అతని కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. బర్త్ డే రోజే తన కొడుకును కౌశిక్ హత్య చేశాడని అతని తల్లి పోలీసు కేసు పెట్టింది. రితేష్ ముక్కు, నోట్లు రక్తం వచ్చిందని, అతని శరీరం మీద ఎక్కడా గాయాలు లేవని పోలీసులు అంటున్నారు. తన కొడుకు రితేష్ ను అతని స్నేహితుడు కౌశిక్ హత్య చేశాడని బర్త్ డే జరుపుకున్న యువకుడి తల్లి కేసు పెట్టడంతో పోలీసులు అనేక కోణాల్లో విచారణ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications