అడ్రస్ అడిగితే ఇంటికి తీసుకెళ్లీ మరీ లైంగికదాడి.. భర్తతో శృంగారం.. ఆపై నాలుక కోసి..

యూపీలో క్రైమ్ ఎక్కువే.. లైంగికదాడులు/ మర్డర్లు వెలుగుచూస్తూనే ఉంటాయి. అయితే ఇటీవల ఓ యువతి అడ్రస్ మరచిపోయింది. ఇంటికి తీసుకు వెళతానని చెప్పి, తన ఇంటికి తీసుకు వెళ్ళింది. తన భర్తతో లైంగికదాడి చేయించింది. అంతేకాదు నాలుక కోసి.. పైశాచికంగా ప్రవర్తించింది. వరదలు రావటంతో రహీంనగర్ ప్రాంతంలో గల బస్తీలో ఇళ్లన్నీ నీట మునిగిపోయాయి. దీంతో అక్కడ ఉన్న ఒక కుటుంబం, లక్నోలోని ఘాజీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్త ప్రాంతానికి వెళ్లారు. సెప్టెంబర్ 21 న ఇంటినుంచి బయటకు వచ్చిన ఆ కుటుంబంలోని 19 ఏళ్ళ యువతి తన ఇంటికి దారి మర్చిపోయింది.

 bizarre incident happen in up

రోడ్డు మీద కనపడిన ఆర్తి అనే మహిళను తనకు గుర్తున్న ఇంటి అడ్రస్ చెప్పి అక్కడి నుంచి ఎలా వెళ్లాలో చెప్పమని కోరింది. ఇంటికి తీసుకువెళతానని చెప్పి ఆర్తి తన ఇంటికి తీసుకువెళ్లింది. తీరా ఇంటి కెళ్లాక తన భర్తతో శృంగారం చేయాలని కోరింది. అందుకు ఆ యువతి అభ్యంతరం చెప్పటంతో ఆర్తి, ఆమె భర్త మున్నా.. ఆ యువతిని కొట్టి మంచానికి కట్టేశారు. ఆర్తి భర్త మున్నా ఆమెపై అత్యాచారం చేశాడు. జరిగిన దారుణాన్ని ఎవరికీ చెప్పకూడదని ఆ యువతి నాలుక కోసేశారు. ఆ తర్వాత వారం రోజుల పాటు మున్నా యువతిపై అత్యాచారం చేస్తూనే ఉన్నాడు. సెప్టెంబర్ 29న దంపతులిద్దరూ బయటకు వెళ్లినప్పుడు యువతి ఇంటి నుంచి తప్పించుకుని పారిపోయింది.

రోడ్డు మీద కనిపించిన ఒక వ్యక్తి సహాయంతో ఇంటికి చేరుకుంది. తమ కూతురు కనపడని రోజునే యువతి తల్లితండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంటికి చేరుకున్న కూతుర్ని చూసి తల్లితండ్రులు సంతోషించారు. ఆమెకు జరిగిన ఘోరాన్ని తెలుసుకుని విలపించారు. వెంటనే ఆమెను చికిత్స కోసం ఆస్పత్రిలో చేర్పించారు. కుదుటపడిన తర్వాత యువతి తాను ఎట్లా మోసపోయానో సవివరంగా కాగితం మీద రాసి తల్లి తండ్రులకు చూపించింది. వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి ఆర్తిని ఆదుపులోకి తీసుకున్నారు. బాధిత యువతి ఆర్తిని గుర్తుపట్టింది. పరారీలో ఉన్న మున్నా కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆర్తిని రిమాండ్‌కు తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+