శునకాన్ని తప్పించుకునేందుకు వెళ్తే .. ప్రాణం తీసేశారు.. ఎక్కడో తెలుసా..?

బారాబంకీ : కొన్ని ఘటనలు చిత్రంగా ఉంటాయి. వినడానికి కూడా విచిత్రంగా అనిపిస్తాయి. అచ్చం ఇలాంటి ఘటనే జరిగింది యూపీలోని బారాబంకీ. తనను కుక్క వెంటాడింది కదా అని ఓ ఇంట్లోకి వెళితే ప్రాణం తీసిన ఘటన సంచలనం సృష్టించింది. అయితే అతన్ని ఎందుకు చితక్కొట్టారో తెలిసి పోలీసులు షాక్‌నకు గురయ్యారు.

యూపీలోని బారాబంకీకి చెందిన యువకుడు ఫూటుగా మద్యం సేవించాడు. అక్కడితో ఆగకుండా తన అత్తగారింటికీ వెళదామని ప్రయత్నించాడు. అలా అనుకోవడమే అతని పాలిట శాపంగా మారింది. అత్తరింటికీ బయల్దేరిన అతను .. దారిలో కుక్కలు మోరిగాయి. దీంతో భయపడ్డ యువకుడు .. దగ్గరలో ఉన్న ఓ ఇంట్లోకి ప్రవేశించాడు. శునకాల భయంతో రయ్యుమని వెళ్లడంతో ఇంట్లో ఉన్న వారు ఒక్కసారిగా షాక్‌నకు గురయ్యారు.

bizarre incident in up.. man dead due to attack

వారు షాక్‌కు గురైతే ఇబ్బంది లేదు. కానీ వచ్చింది ఎవరో ఆరా తీయలేదు. దొంగ అని భావించారు. తమ ఇంట్లోకి ప్రవేశించిన యువకుడికి టార్చర్ అంటే ఏంటో చూపించారు. తమ వద్ద ఉన్న ఇనుప చువ్వను కాల్చి వేధించారు. అయితే అప్పటికే మద్యం మత్తులో ఉన్న ఆ యువకుడు ఏమీ స్పందించలేకపోయారు. కానీ భగ భగ మండే అగ్నితో ఆ యువకుడు చనిపోయాడు. ఈ ఘటన దర్యాప్తులో భాగంగా విస్తుగొలిపే నిజాలు వెలుగుచేశాయి. యువకుడిపై దాడి చేసింది ఐదుగురు అని పేర్కొన్నారు. ఒకే కుటుంబానికి చెందిన వారిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+