కసాయి కొడుకు: మద్యం కోసం తల్లిని చంపి ఆమె మెదడును వేపుడు చేశాడు

ఛత్తీస్‌గఢ్: నవమాసాలు మోసి జన్మనిచ్చిన తల్లినే చంపాడు ఓ కసాయి కొడుకు. మద్యానికి బానిసై ఏకంగా తల్లినే తెగ నరికాడు. ఈ ఘటన ఛత్తీస్‌గడ్‌లోని రాయిగఢ్‌లో చోటుచేసుకుంది. మద్యం సేవించి తల్లిని చంపలేదు... మద్యం కొనేందుకు డబ్బులివ్వలేదని తల్లిని హత్యచేశాడు. ఈ ఘటన తీవ్ర కలకలం సృష్టించింది.

మద్యానికి బానిసైన సీతారాం

మద్యానికి బానిసైన సీతారాం

మద్యం మనిషిని రాక్షసుడిగా మారుస్తుందని చెప్పేందుకు ఈ ఉందంతమే నిదర్శనం. నవమాసాలు మోసి కని పెంచిన తల్లిని మద్యం కోసం తెగనరికాడు సీతారాం అనే కసాయి కొడుకు. వివరాల్లోకి వెళితే... ఖార్సియా జిల్లా బోటాల్డా గ్రామంలో తల్లితో పాటు నివాసముంటున్న సీతారాం మద్యానికి బానిసయ్యాడు. తాగేందుకు డబ్బులు ఇవ్వాల్సిందిగా తల్లిని ఎప్పుడూ వేధించేవాడు. ఇక మద్యానికి బానిసయ్యాడని గ్రహించిన తల్లి పూలో బాయ్.. డబ్బులు ఇవ్వడం మానేసింది.

తల్లిని చంపి మెదడును...

తల్లిని చంపి మెదడును...

ఒకరోజు డబ్బులు ఇవ్వాల్సిందిగా తల్లిని వేధించాడు. ఆమె డబ్బులు ఇవ్వకపోవడంతో సీతారాం ఓ పదునైన ఆయుధంతో తల్లి పూలోబాయ్‌పై దాడి చేశాడు. దీంతో ఆమె మృతి చెందింది. వెంటనే ఆమె తలను చీల్చి మెదడును బయటకు తీశాడు. ఇక అంతటిలో ఆగలేదు. వెంటనే ఆ మెదడును ఓ గిన్నెలో వేసి వేపుడు చేశాడు. ఆ తర్వాత తినేందుకు సిద్ధమవుతుండగా సీతారాం తమ్ముడి భార్య ఇంట్లోకి వచ్చింది. అక్కడ ఘటనను చూసి షాక్ అయ్యింది. తమ్ముడి భార్యను చూసిన సీతారాం అక్కడి నుంచి పరుగులు తీశాడు. జరిగిన ఘటనపై వెంటనే తన భర్తకు సమాచారం అందించింది. ఆ తర్వాత పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు సీతారాం కోసం గాలింపు చర్యలు చేపట్టి ఓ చోట నక్కి ఉండటం గమనించి పట్టుకున్నారు. విచారణ చేయగా నేరం ఒప్పుకున్నాడు సీతారాం.

సీతారం మానసిక పరిస్థితి సరిగ్గా లేదన్న పోలీసులు

సీతారం మానసిక పరిస్థితి సరిగ్గా లేదన్న పోలీసులు

సీతారాంపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. అంతేకాదు సీతారాం మద్యంకు బానిసయ్యాడని మానసిక పరిస్థితి కూడా స్థిరంగా లేదని పోలీసులు చెప్పారు. ఇదిలా ఉంటే తన అన్న మద్యంకు బానిస కాకుండా పలుమార్లు ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నం చేశామని అయినప్పటికీ వినలేదని సీతారాం తమ్ముడు చెప్పాడు. ఇక ఇదే విషయమై ఇద్దరి మధ్య తరుచూ గొడవ అవుతుండటంతో ఇంటిని వీడి మరో ఇంట్లో తాను నివాసముంటున్నట్లు చెప్పాడు సీతారాం సోదరుడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+