రెండు తలలు, మూడు చేతులు:కవలలు అనుకుంటే.. ఒక్క చిన్నారే, ఇలా...

కలికాల ప్రభావమో.. లేదంటే బ్రహ్మంగారూ చెప్పిన మాట బలమో తెలియదు కానీ.. రోజుకో వింత జరుగుతుంది. పసిపిల్లలే వృద్ధుల మాదిరిగా జన్మిస్తున్నారు. జన్యులోపాలు అని పైకి చెప్తున్న ఇంకేదో ఉంది అనే అనుమానం మాత్రం సాటి వారి మెదళ్లను తొలచివేస్తోంది. ఇందుకు ఊతమిస్తూ మధ్యప్రదేశ్‌లో ఇలాంటి ఘటన ఒకటి జరిగింది. విదిశ జిల్లాలో ఓ డెలివరీ ఆందోళన కలిగిస్తోంది.

డెలివరీ తర్వాత..

డెలివరీ తర్వాత..

విదిశ జిల్లా మల గ్రామానికి చెందిన ఓ మహిళకు ఏడాదిన్నర క్రితం వివాహమైంది. ఆమె గర్భం దాల్చడంతో కుటుంబసభ్యుల ఆనందానికి అవధి లేకుండా పోయింది. ఆమెకు నెలలు గడవడంతో విదిశ జిల్లా ప్రధాన ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆమె ప్రెగ్నెన్సీ వచ్చినప్పటీ నుంచి అక్కడి వైద్యులు పరీక్షిస్తున్నారు. కానీ ప్రసవం తర్వాత చిన్నారిని చూసి ఆశ్చర్యపోయారు.

 రెండు తలలు, మూడు చేతులు

రెండు తలలు, మూడు చేతులు

శనివారం వివాహితకు సర్జరీ చేశారు. డెలివరీ అయ్యాక వైద్యులే నోరెళ్లబెట్టారు. వివాహితకు జన్మించింది మగబిడ్డే.. కానీ చిన్నారికి రెండు తలలు, మూడు చేతులు ఉన్నాయి. ఏం జరిగిందని, ఎక్కడ లోపం జరిగిందని వారు ఆందోళన చెందారు. వివాహితకు సోనోగ్రఫీ పరీక్ష చేసిన సమయంలో కవలలు జన్మిస్తారని అనుకొన్నామని వైద్యులు చెప్తున్నారు. కానీ చిన్నారి ఇలా జన్మించడం చూసి వారే షాక్‌కు గురయ్యారు.

పర్యవేక్షణలో

పర్యవేక్షణలో

ప్రస్తుతం చిన్నారిని స్పెషల్ న్యూ బర్న్ కేర్ యూనిట్‌లో చికిత్స అందిస్తున్నారు. రెండు తలలు చిన్నారి జన్మించడం ఇదే తొలిసారి అని డాక్టర్ ప్రతిభ తెలిపారు. కుటుంభసభ్యులు కూడా ఆందోళన చెందారు. చిన్నారి తల్లికి విషయం కూడా చెప్పలేదు. అసలే సర్జరీ అయిన ఆమె..తన బిడ్డకు రెండు తలలు ఉన్నాయని చెబితే ఎంత కుమిలిపోతుందని దాచిపెట్టారు.

సలహా మేరకు

సలహా మేరకు

చిన్నారిని పరీక్షిస్తున్నామని పిల్లల వైద్య నిపుణులు సురేంద్ర సోన్‌కర్ పేర్కొన్నారు. 24 గంటల పాటు చిన్నారిని అబ్జర్వ్ చేస్తున్నామని తెలిపారు. గతంలో ఇలాంటి కేసులు ఎదుర్కొన్న వైద్య నిపుణులు సలహాలు, సూచనలు తీసుకుంటున్నామని వివరించారు. భోపాల్, ఢిల్లీకి చెందిన వైద్యులను సంప్రదిస్తున్నామని తెలిపారు. వారి సూచనల ఆధారంగా ట్రీట్‌మెంట్ అందిస్తామని చెప్పారు.

బారులుతీరిన జనం

బారులుతీరిన జనం

మరోవైపు రెండుతలల చిన్నారి జన్మించిందని తెలిసి.. చూసేందుకు జనం ఆస్పత్రి వద్ద బారులు తీరారు. దీంతో ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందజేశారు. జనాన్ని నిలువరించేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. వారిని ఆస్పత్రి ప్రాంగణం నుంచి పంపించివేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+