Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తెలంగాణలో పక్కరాష్ట్రం మంత్రులకు గ్రాండ్ పార్టీలు, ఎంజాయ్ చెయ్యండి, ప్రతిపక్షం ఫైర్ !

బెంగళూరు: కర్ణాటకలోని సిద్ధరామయ్య ప్రభుత్వంపై బీజేపీ విమర్శలు చేస్తూనే ఉంది. కర్ణాటకలో కరువు పరిస్థితులు నెలకొంటున్నా రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చూపకుండా సరదాగా ఎంజాయ్ చేస్తూ పార్టీలు చేసుకుంటున్నదని బీజేపీ ఆరోపించింది. కర్ణాటకలోని సిద్ధరామయ్య ప్రభుత్వం మస్త్ మజా పార్టీలు చేసుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందని కర్ణాటక బీజేపీ శాఖ విమర్శించింది.

కర్ణాటక బీజేపీ అధికారిక X (ట్విట్టర్)లో సిద్దరామయ్య ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోసిన బీజేపీ సిద్దరామయ్య ప్రభుత్వం మీద పలు ఆరోపణలు చేసింది. సిద్ధరామయ్య ప్రభుత్వం మస్త్ మజా పార్టీలు చేసుకుంటూ సరదాగా గడుపుతోంది అంటూ బీజేపీ ఓ జాబితాను ఎక్స్ లో విడుదల చేసింది. తెలంగాణ అసెంబ్లీఎన్నికల ప్రాచారం చెయ్యడానికి వెలుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద బీజేపీ అనేక ఆరోపణలు చేసింది.

BJP accused Karnataka ministers of throwing grand parties in Telangana during drought
బెంగళూరు మీద కన్నుపడింది, క్యూలో ఉన్నారు, ప్రధాని మోదీ ఏం చేస్తారో అని అందరూ వెయిటింగ్ !

కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రభుత్వం మంత్రులు, నాయకులు మస్త్ మజా పార్టీలకు వత్తాసు పలుకుతున్నారని బీజేపీ ఆరోపించింది. సిద్దరామయ్య మీద బీజేపీ చేస్తున్న ఆరోపణల జాబితా ఇలా ఉంది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఇంటికి విలాసవంతమైన టచ్ వచ్చేసిందని బీజేపీ ఆరోపించింది. కర్ణాటక మంత్రులకు లగ్జరీ కార్లు సిద్దరామయ్య ప్రభుత్వం బహుమతిగా ఇచ్చిందని. కర్ణాటక మంత్రుల కార్యాలయాలు, ఇల్లు దగదగా మెరిసిపోవడానికి ఖరీదైన ఏషియన్ పెయింట్స్ వాడారని బీజేపీ ఆరోపించింది.

కర్ణాటకలోని కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులకు తెలంగాణాలో పెద్ద పార్టీ ఇవ్వడానికి అన్నీ ఫిక్స్ అయ్యాయని. మంత్రి సతీష్ జారకిహోళి దుబాయ్ పర్యటన ఖరారైందని, కర్ణాటక హోమ్ శాఖా మంత్రి డాక్టర్ పరమేశ్వర్ విదేశీ పర్యటన విజయవంతమైందిని, కరువు కాలంలో కూడా సిద్దరామయ్య ప్రభుత్వంలోని పలువురు పెద్దలు మస్త్ మజా పార్టీలు నిర్వహిస్తూ ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారని కర్ణాటక బీజేపీ శాఖ మండిపడింది.

కేఈఏ పరీక్షలో అక్రమాలు చోటుచేసుకోవడంతో కర్ణాటక ఐటీ బీటీల శాఖా మంత్రి ప్రియాంక్ ఖార్గే పాత్ర ఉందని బీజేపీ ఆరోపించింది. కేఈఏ పరీక్షల అవకతవకలకు పాల్పడిన వారి బ్యాంకు ఖాతాల్లో కోట్లు కోట్లు వెళ్లాయని, కానీ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని మంత్రి ప్రియాంక్ ఖార్గే అంటున్ననారని బీజేపీ ఆరోపించింది. మంత్రి ప్రియాంక్ ఖార్గే తనకు ఎలాంటి సంబంధం లేదన్న భ్రమలో మునిగిపోతున్నారని, కర్ణాటక బీజేపీ శాఖ ఆరోపించింది.

BJP accused Karnataka ministers of throwing grand parties in Telangana during drought

కేఈఏ పరీక్షలో అవకతవకలపై గతంలోనే ఫిర్యాదు చేశామని, ఇప్పుడు సిద్దరామయ్య ప్రభుత్వంలోని పెద్దలు, మంత్రి ప్రియాంక్ ఖార్గే ఎందుకు మౌనంగా ఉన్నారని, కేఈఏ పరీక్షల అక్రమాల కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించడాన్ని సిద్దరామయ్య ప్రభుత్వం ఎందుకు వ్యతిరేకిస్తున్ననదని, దీనికి మంత్రి ప్రియాంక్ ఖార్గే సమాధానం చెప్పాలని బీజేపీ డిమాండ్ చేస్తున్నది.

కర్ణాటకలో అంతకు ముందు బీజేపీ ప్రభుత్వ హయాంలో పీఎస్‌ఐ రిక్రూట్‌మెంట్ కుంభకోణం కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఎందుకంటే ఎస్ఐ ఉద్యోగాల నియామకానికి సంబంధించిన పీఎస్ఐ స్కామ్ లో రాజకీయ పార్టీల నాయకులు, ఐపీఎస్ అధికారితో పాటు పోలీసు అధికారులు చిక్కుకుని అందరూ జైలుపాలైనారు. బీజేపీ ఎన్నికల ఓటమికి ఇదీ ఓ కారణం అని కన్నడిగులకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పీఎస్ఐ ప్రవేశ పరీక్షల అక్రమాలపై పెద్దఎత్తున పోరాటం చేసి ఇప్పుడు అధికారంలోకి వచ్చింది. ఉంది, కేఈఏ పరీక్షలో అక్రమాలు జరిగాయని, ప్రధాన నిందితుడికి పోలీసులు రక్షణ కల్పించారని తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి పోలే అంటూ వెళ్లిపోతున్న సిద్దరామయ్యతో పాటు ఆయన ప్రభుత్వంలోని మంత్రులు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేసిన కర్ణాటక బీజేపీ ఇప్పుడు వారి మీద దుమ్మెత్తిపోస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+