తెలంగాణలో గ్యాప్ ఇచ్చి పక్కరాష్ట్రంలో వేలంపాటకు ఢిల్లీ కలెక్షన్ ఏజెంట్, సీఎం డీసీఎంలతో డీల్ !

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి బ్రేక్ పడటంతో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఇప్పుడు పక్కరాష్ట్రం కర్ణాటక మీద కన్ను వేసింది. కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అక్కడ నామినేటెడ్ పోస్టుల భర్తీకి కసరత్తులు చేస్తోంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లోకర్ణాటకలోని 28 లోక్ సభ నియోజకవర్గాలకు గాను 20 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంది.

కాంగ్రెస్ పార్టీలోని అసంతృప్తిని చల్లార్చేందుకు కార్పొరేషన్ చైర్మన్, అధ్యక్ష పదవులు కట్టపెట్టాని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ డిసైడ్ అయ్యింది. కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ రణదీప్ సింగ్ సూర్జేవాలా బెంగళూరు చేరుకుని కార్పొరేషన్ చైర్మన్, బోర్డు అధ్యక్షుల పదవులు కట్టపెట్టే విషయంలో సీఎం సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తదితరులతో చర్చించారు. కాంగ్రెస్‌ పార్టీ కర్ణాటకలోని కార్పొరేషన్‌ బోర్డు పదవుల వేలం వెయ్యడానికి సిద్దం అయ్యింది కర్ణాటక బీజేపీ నాయకులు ట్వీట్ చెయ్యడం కలకలం రేపింది.

BJP accused of starting Randeep Singh Surjewalas auction for corporation chairman posts in Karnataka

కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ ఏజెంట్ రణదీప్ సింగ్ సుర్జేవాలా బెంగళూరు వచ్చేశాడని, కార్పొరేషన్‌ బోర్డుల వేలం ప్రక్రియ ప్రారంభమైందని కర్ణాటకలోని కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బీజేపీ దుమ్మెత్తిపోసింది. కేపీసీసీ అధ్యక్ష పదవి నియామకం ముందు జరిగిన వేలం పాటను ఇప్పుడు కలెక్షన్ ఏజెంట్ రణదీప్ సింగ్ సూర్జేవాలా మరోసారి తూతూమంత్రంగా నిర్వహిస్తున్నారని కర్ణాటక బీజేపీ నాయకులు ఆరోపించారు.

కర్ణాటక కార్పొరేషన్ బోర్డు చైర్మన్ పదవికి పైన పేర్కొన్న అర్హతలు ఉన్నవారు ప్రయత్నించవచ్చని, వేలం పాటలో పాల్గొనేవారు రెడీగా ఉంటే వారికే లాభం అంటూ కర్ణాటక బీజేపీ నాయకులు ఆ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుకు కారణమైన కార్యకర్తలకు ఈసారి కార్పోరేషన్ బోర్డు అధ్యక్ష పదవులు, బోర్డు మెంబర్లుగా తము అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

కర్ణాటక కార్పోరేషన్ బోర్డు అధ్యక్ష పదవులు, చైర్మన్ పదవులు ఆశిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇప్పటికే కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌కు లేఖ రాశారు. కార్పొరేషన్ బోర్డు అధ్యక్ష పదవులు చైర్మన్ పదవులు ఎవరికి ఇవ్వాలనే విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓ జాబితాను సిద్దం చేశారు. ఆ జాబితాలో ఎక్కువగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారని తెలిసింది.

BJP accused of starting Randeep Singh Surjewalas auction for corporation chairman posts in Karnataka

ఇదే సందర్బంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతల అభిప్రాయాలను కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ సేకరించారని, ఈ అభిప్రాయాల ఆధారంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కర్ణాటక కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ చార్జ్ రణదీప్ సింగ్ సూర్జేవాలాతో తుది సమావేశం నిర్వహించి ఆ జాబితాను ఖరారు చేస్తారని తెలిసింది. తొలిదశలో 25 మంది అభ్యర్థులతో ఇప్పటికే జాబితా సిద్ధం కాగా వారిలో కొందరు మంత్రి పదవులు ఆశించి, తమకు కార్పొరేషన్-బోర్డు పదవులు అక్కర్లేదని చెబుతున్నారని తెలిసింది.

ఈ నేపథ్యంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ నేతలు, ఎమ్మెల్యేల అభిప్రాయాలను సేకరించారు. తొలి దశ జాబితాలో ఉన్న 25 మంది ఎమ్మెల్యేలు, శాసనమండలి సభ్యులు. లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని 15 మంది పార్టీ కార్యకర్తలతో ఓ జాబితాను ఖరారు చేయడంపై కూడా చర్చించనున్నట్లు సమాచారం. మంత్రి పదవులు రాకపోవడంతో అసహనంతో ఉన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యేలతో సీఎం సిద్ధరామయ్య, డీకే శివకుమార్, కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ సూర్జేవాలా విడివిడిగా చర్చలు జరిపినట్లు తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+