ఢిల్లీ పెద్దలకు మామూళ్లు, లేదంటే తేడాలు, సీఎం, మంత్రుల టార్గెట్ ఫిక్స్, ఫైల్ కదలాలంటే ?
కర్ణాటకలో బీజేపీ-కాంగ్రెస్ పార్టీల మధ్య కొనసాగుతున్న ఉచిత హామీల పోరు ముదురుతోంది. ఒకరికొకరు సవాళ్లు విసురుకుంటూ పరసర్పర విమర్శలు కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ పోరు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇది చాలదన్నట్లుగా ఈ పోరు నానాటికీ సాగుతుండగా ఇప్పుడు కర్ణాటకలోని బీజేపీ నాయకులు సిద్దరామయ్య ప్రభుత్వం మీద కొత్త అస్త్రాన్ని ప్రయోగించింది.
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు కావస్తున్నా బీజేపీ-కాంగ్రెస్ పార్టీల వార్ గంటగంటకు పెరుగుతోంది. ఇన్ని రోజులు కర్ణాటకలో ప్రతిపక్ష నాయకుడు లేడు, కర్ణాటక బీజేపీ శాఖకు కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోలేని దుర్బరపరిస్థితిలో బీజేపీ నాయకులు ఉన్నారని ఆరోపిస్తూ బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ తన అస్త్రాన్ని ప్రయోగించింది. కాంగ్రెస్ దెబ్బతో బీజేపీ హైకమాండ్ అప్రమత్తమైంది.

దీంతో కర్ణాటక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బీవై విజయేంద్ర, కర్ణాటక అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఆర్.అశోక్ ఎన్నికయ్యారు. ఇలా బీజేపీకి కొత్త ఊపు వచ్చి కాంగ్రెస్ప పార్టీ మీద దాడి మొదలుపెట్టింది. బీజేపీ ఇప్పుడు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో, ప్రత్యక్షంగా, పరోక్షంగా విరుచుకుపడుతోంది. అవినీతిలో కూరుకుపోయిన కర్ణాటకలోని సిద్దరామయ్య ప్రభుత్వంలో ఏ ఫైల్ కదిలినా మనం నాయకులకు లంచం చెల్లించాల్సిందే అని బీజేపీ కర్ణాటక రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర ఆరోపించారు.
ఉదయం వైద్యారోగ్య శాఖ అవినీతి బయటపడితే సాయంత్రానికి విద్యుత్ శాఖలో శాఖ అవినీతి బయటపడుతోందని, కర్ణాటకలోని సిద్దరామయ్య ప్రభుత్వం ప్రతినెలా కొంత మొత్తం వసూళ్లు చేసి ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ పెద్దలకు క్రమం తప్పకుండా పంపాలని టార్గెట్ ఫిక్స్ చేసుకున్నందున ఉదయం నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు అన్ని శాఖల్లో అవినీతి జరుగుతోందని బీవై విజయేంద్ర ఆరోపించారు.
సిద్దరామయ్య ప్రభుత్వం అవినీతికి అడ్డాగా మారిపోయిందని బీవై విజయేంద్ర ఆరోపించారు. సిద్దరామయ్య ప్రభుత్వంలోని అవినీతి పదేపదే బయటపడినా ఆ ప్రభుత్వంలోని పెద్దలు, అవినీతి అధికారులు ఎలుకలు తప్పించుకున్నట్లు తప్పించుకుంటున్నారని, త్వరలో అన్ని ఆధారాలు బయటపెడుతామని బీజేపీ కర్ణాటక శాఖ అంటోంది. మొత్తం మీద కర్ణాటలో బీజేపీ-కాంగ్రెస్ పార్టీల నాయకులు ఒకరిమీద ఒకరు తారాస్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు.












Click it and Unblock the Notifications