యూపిలో సగం స్థానాలు బిజెపికే, ఢిల్లీలో మోడీ జోరు

న్యూఢిల్లీ: రానున్న సార్వత్రిక ఎన్నికలలో ఉత్తర ప్రదేశ్, ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ హవా ఉండనుందట. పలు సర్వేలు దేశంలో ఎన్డీయే కూటమికి భారీ స్థానాలు వస్తాయని చెబుతున్న విషయం తెలిసిందే. తాజాగా సిఎన్ఎన్ - ఐబిఎన్ సర్వే ప్రకారం... యూపిలో బిజెపి 42 నుండి 50 స్థానాలను గెలుచుకుంటుందట.

ఉత్తర ప్రదేశ్‌లో మొత్తం 80 లోకసభ స్థానాలు ఉన్నాయి. అందులో బిజెపి, దాని మిత్రపక్షం అప్నా దళ్ 42-50 కైవసం చేసుకోనుంది. ఎస్పీకి 11-17, బిఎస్పీకి 10-16, కాంగ్రెసు-ఆర్ఎల్డీ కూటమికి 4-8 స్థానాలు దక్కే అవకాశముంది. యూపిలో ప్రధానమంత్రి పదవికి అత్యంత ప్రజాదరణ గల నేతగా నరేంద్ర మోడీకి ప్రజలు మద్దతిచ్చారు. రాహుల్ గాంధీ రెండో స్థానంలో ఉన్నారు.

BJP and allies to get 42-50 seats in UP, survey predicts

మరోవైపు ఢిల్లీలోని ఎక్కువ లోకసభ సీట్లలో బిజెపి విజయబావుటా ఎగురవేయనుందట. తాజాగా వెలువడిన ఒపీనియన్ పోల్ ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. 2009లో ఢిల్లీలోని మొత్తం ఏడు సీట్లను కాంగ్రెస్ సొంతం చేసుకుంది. అయితే, ప్రస్తుత సర్వే ప్రకారం దేశ రాజధానిలో ఐదు నుంచి మొత్తం ఏడు సీట్లు బిజెపి ఖాతాలోకి వెళ్లనున్నాయని తేలింది.

ఇక కాంగ్రెస్ సున్నా నుంచి ఒక సీటులో గెలిచే అవకాశం ఉందని తాజా సర్వే వెల్లడించగా, ఎఎపి సున్నా నుంచి రెండు సీట్లు దక్కించుకుంటుందని తెలిపింది. ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో అనూహ్య ఫలితాలను సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఏఏపీ) రాబోయే లోక్‌సభ ఎన్నికలలో 28 శాతం ఓట్లతో రెండో స్థానంతో సరిపెట్టుకోనుందని వెల్లడైంది.

దేశవ్యాప్తంగా మోడీ ప్రభంజనం వీస్తోందంటూ పలు సర్వేలు చెబుతుండగా, ఢిల్లీలో ఆ ప్రభావం మరింత ఎక్కువగా ఉందని తాజాగా విడుదలైన ఇండియా టుడే అధ్యయనం పేర్కొంది. ఈ అధ్యయనం ప్రకారం గత డిసెంబర్ నాటి అసెంబ్లీ ఎన్నికలలో 31 శాతంగా ఉన్న బిజెపి ఓటు బ్యాంకు ప్రస్తుతం 41 శాతానికి పెరిగింది. 2009లో 53 శాతంగా ఉన్న కాంగ్రెస్ ఓటింగ్ ఇప్పుడు 23 శాతానికి పడిపోయింది.

గత సార్వత్రిక ఎన్నికలలో 68 శాతం మంది ముస్లింలు కాంగ్రెస్‌కు ఓటు వేస్తే ఇప్పుడు అది 41 శాతానికి తగ్గిపోవడం గమనార్హం. వ్యాపార వర్గాలు, జాట్స్ సహా ఇతర బలహీనవర్గాల చూపు ఈసారి బిజెపి ఉండగా, దళితులు, పంజాబీలు ఎఎఫికి మద్దతుగా నిలుస్తున్నారని ఆ అధ్యయనం వెల్లడించింది. ప్రధాని ఎవరు కావాలనుకుంటున్నారన్న ప్రశ్నకు మోడీకి 44 శాతం మంది జై కొట్టగా, అరవింద్ కేజ్రీవాల్‌కు 24 శాతం మంది ఆమోదం తెలిపారు. ఇక రాహుల్‌ను 19 శాతం కోరుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+