'మహా' రసవత్తరం: మోడీ నో, బీజేపీపై ఆదిత్య ఆగ్రహం

బాల్ థాకరే పైన గౌరవంతో తాము శివసేనను ఏమీ అనడం లేదని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. అయితే, బీజేపీ నేతలు మాత్రం గెలుపు కోసం, శివసేన పైన పైచేయి కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే విదర్భ ప్రత్యేక రాష్ట్రం విషయంలో శివసేనను ఇరుకున పడేసే విధంగా బీజేపీ వ్యాఖ్యలు చేసింది. తాము విదర్భకు వ్యతిరేకం కాదని, సేన కారణంగానే తాము రాష్ట్రం ఇవ్వలేకపోయామని చెబుతోంది. అయితే, దీనిని ప్రధాన అస్త్రంగా మాత్రం ఉపయోగించుకోవద్దని భావించింది.
కానీ, ఎన్సీపీ విదర్భకు తాము వ్యతిరేకం కాదని చెప్పడం.. బీజేపీని ఇరుకున పడేసిందని చెబుతున్నారు. కాంగ్రెస్, ఎన్సీపీలు కూడా పొత్తుకు పరస్పరం ఆరోపణలు గుప్పించుకుంటున్నాయి.
కాగా, శివసేన యూత్ వింగ్ లీడర్ ఆదిత్య థాకరే మాట్లాడుతూ... ఇరవై అయిదేళ్ల పొత్తును తెంచుకోవడం ద్వారా బీజేపీ బాల్ థాకరేను వెన్నుపోటు పొడిచిందని విమర్శించారు. అయితే, మోడీ మాత్రం శివసేన పైన ఒక్క విమర్శ కూడా చేయవద్దని తాను నిర్ణయించుకున్నానని, ఇదే తాను బాల్ థాకరేకు ఇచ్చే గౌరవమని చెప్పారు. తాము కష్ట సమయంలో బీజేపీకి అండగా నిలిచామన్నారు. బీజేపీ తన వయస్సును బట్టి అంచనా వేస్తోందని విమర్శించారు. కలిసి పోటీ చేసేందుకు ప్రయత్నిస్తే బీజేపీ పట్టించుకోలేదన్నారు.












Click it and Unblock the Notifications