ఎన్నికల ప్రచారం పక్కనపెట్టి పరీక్షలకు హాజరైన బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి, ఖార్గే ఫ్యామిలీతో ఫైట్ !

బెంగళూరు: కర్ణాటకలోని చించోళి శాసన సభ నియోజక వర్గం నుంచి బీజేపీ టిక్కెట్ మీద పోటీ చేస్తున్న డాక్టర్ అవినాష్ జాదవ్ ఎన్నికల ప్రచారం పక్కన పెట్టి ఎండీ పరీక్షలు రాస్తున్నారు. మే 19వ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. మే 23వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. బుధవారం ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్న డాక్టర్ అవినాష్ జాదవ్ కులబరిగి నగరంలోని ఎంఆర్ సీ మెడికల్ కాలేజ్ లో ఎండీ పరిక్షలు రాశారు.

తండ్రి రాజీనామాతో కొడుక్కు టిక్కెట్

తండ్రి రాజీనామాతో కొడుక్కు టిక్కెట్

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే డాక్టర్ ఉమేష్ జాదవ్ ఆ పార్టీకి రాజీనామా చెయ్యడంతో చించోళి శాసన సభ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. డాక్టర్ ఉమేష్ జాదవ్ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చెయ్యడంతో చించోళి శాసన సభ నియోజక వర్గం సీటు ఆయన కుమారుడు డాక్టర్ అవినాష్ జాదవ్ కు ఇచ్చారు. కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా సుభాష్ రాథోడ్ పోటీ చేస్తున్నారు.

అనుమానం లేదు

అనుమానం లేదు

చించోళి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన డాక్టర్ ఉమేష్ జాదవ్ కుమారుడు డాక్టర్ అవినాష్ జాదవ్ ను గెలిపించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. డాక్టర్ అవినాష్ జాదవ్ పరీక్షలకు హాజరౌతున్నారని, ఆయనకు మద్దతుగా స్థానిక బీజేపీ నాయకులు ప్రచారం చేస్తున్నారని, బీజేపీ కచ్చితంగా విజయం సాదిస్తుందని, అందులో ఎలాంటి అనుమానం లేదని డాక్టర్ ఉమేష్ జాదవ్ ధీమా వ్యక్తం చేశారు.

మామ ఫ్యామిలీ వ్యతిరేకం

మామ ఫ్యామిలీ వ్యతిరేకం

డాక్టర్ అవినాష్ జాదవ్ ఆరు నెలల క్రితం వివాహం చేసుకున్నారు. డాక్టర్ అవినాష్ జాదవ్ రాజకీయాల్లోకి రావడం ఆయన మామ కుటుంబ సభ్యులకు ఇష్టం లేదు. అయితే బీజేపీ టిక్కెట్ ఇవ్వడంతో ఆనివార్యపరిస్థితులంలో డాక్టర్ అవినాష్ జాదవ్ రాజకీయాల్లోకి ప్రవేశించారు. చించోళి శాసన సభ నియోజక వర్గం ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న డాక్టర్ అవినాష్ జాదవ్ మామ కుటుంబ సభ్యులను ఒప్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

సోదరుడికి టిక్కెట్

సోదరుడికి టిక్కెట్

చించోళి శాసన సభ నియోజక వర్గం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన డాక్టర్ ఉమేష్ జాదవ్ తన సోదరుడు రామచంద్ర జాదవ్ కు టిక్కెట్ ఇవ్వాలని బీజేపీ నాయకులకు మనవి చేశారు. అయితే అన్ని విషయాలు క్షుణ్ణంగా పరిశీలించిన బీజేపీ డాక్టర్ ఉమేష్ జాదవ్ కుమారుడు డాక్టర్ అవినాష్ జాదవ్ కు టిక్కెట్ కేటాయించింది. డాక్టర్ అవినాష్ జాదవ్ మొదటి సారి ఎన్నికల బరిలో దిగుతున్నారు.

ఫ్యామిలీ ఫైట్

ఫ్యామిలీ ఫైట్

కొంత కాలం క్రితం కాంగ్రెస్ కు రాజీనామా చేసిన ఉమేష్ జాదవ్ బీజేపీలో చేరారు. చించోళి శాసన సభ నియోజక వర్గం నుంచి సుభాష్ రాథోడ్ కాంగ్రెస్ టిక్కెట్ మీద పోటీ చేస్తున్నారు. చించోళి శాసన సభ నియోజక వర్గం ఉప ఎన్నికలు లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖార్గే కుటుంబ సభ్యులకు, డాక్టర్ ఉమేష్ జాదవ్ కుటుంబ సభ్యుల పరువు ప్రతిష్టకు చాలెంజ్ గా జరుగుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+