బిగ్ ఫైట్, శ్రీరాములుకు బీజేపీ టిక్కెట్, భార్య ఇండిపెండెంట్, అక్కకు వైసీపీ ఎంపీ టిక్కెట్, వావ్!
ఎక్కడ చూసినా ఎన్నికల వేడితో ప్రజలు మంచి హీట్ మీద ఉన్నారు. మైనింగ్ అడ్డా బళ్లారిలో లోక్ సభ ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది. కర్ణాటకలోని హాట్ లోక్ సభ నియోజక వర్గాల్లో బళ్లారి నియోజక వర్గం ముందు వరుసలో ఉంది. అలాంటి బళ్లారిలో ఇప్పుడు జరుగుతున్న లోక్ సభ ఎన్నికలకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. గాలి జనార్దన్ రెడ్డి బీజేపీలోకి మళ్లీ ఎంట్రీ ఎవ్వడంతో బళ్లారిలో రాజకీయాలు రసవత్తరంగా మారిపోయాయి.
బళ్లారి లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి రెండో విడతలో నామినేషన్ పత్రాల సమర్పణ ప్రారంభమైంది. తొలిరోజు నలుగురు అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఆశ్చర్యకరంగా బళ్లారి లోక్ సభ నియోజక వర్గం బీజేపీ అభ్యర్థి, మాజీ మంత్రి బి శ్రీరాములు భార్య భాగ్యలక్ష్మి పార్టీలకతీతంగా స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ పత్రాలు సమర్పించడం కలకలం రేపింది. బళ్లారి లోక్ సభ నియోజజక వర్గంలో బీజేపీ అధికారికంగా మాజీ మంత్రి శ్రీరాములకు టిక్కెట్ ఇచ్చింది.

సాంకేతిక కారణాలతో శ్రీరాములు నామినేషన్ తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉందనే అనుమానంతో ఇప్పుడు అదే శ్రీరాములు భార్య భాగ్యలక్ష్మి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. శ్రీరాములు నామినేషన్‌ను ఎన్నికల అధికారులు అధికారికంగా స్వీకరిస్తే ఆయన భార్య భాగ్యలక్ష్మి నామినేషన్‌ను వెనక్కి తీసుకుంటారని ఆయన అనుచరులు అంటున్నారు. శ్రీరాములు భార్య భాగ్యలక్ష్మి ఆస్తి వివరాలు ఎన్నికల అధికారులకు సమర్పించారు.
మాజీ మంత్రి శ్రీరాములు భార్య భాగ్యలక్ష్మి మొత్తం ఆస్తి విలువ రూ 22. 57 కోట్ల రూపాయలు. ఇందులో రూ.2. 50 లక్షల నగదు ఉంది. శ్రీరాములు భార్య భాగ్యలక్ష్మి ఛరాస్తుల విలువ రూ.2. 28 కోట్లు. అలాగే ఆమెకు 20.29 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి. భాగ్యలక్ష్మి పేరు మీద ఎలాంటి వాహనాలు లేవు. బళ్లారి శ్రీరాములు భార్య భాగ్యలక్ష్మి దగ్గర 2. 33 కిలోలు బంగారం ఉంది. అయితే ఆమె దగ్గర వెండి మాత్రం లేదని ఎన్నికల అధికారులకు అఫిడవిట్ సమర్పించారు.

శ్రీరాములు భార్య భాగ్యలక్ష్మికి ఎలాంటి రుణం లేదు. కర్ణాటక మాజీ మంత్రి శ్రీరాములు సోదరి, బళ్లారి మాజీ ఎంపీ జే శాంత కూడా వైఎస్సార్‌సీపీ పార్టీలో చేరిపోయారు. మాజీ మంత్రి శ్రీరాములు సోదరి జే శాంత ఈసారి ఆంధ్రప్రదేశ్ లోని హిందూపురం లోక్ సభ నియోజక వర్గం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. బళ్లారిలో తొలిరోజు నాలుగు నామినేషన్ పత్రాల సమర్పించారు. తొలి రోజైన శుక్రవారం ఎస్ యూసీఐ (కమ్యూనిస్టు) పార్టీ అభ్యర్థి ఏ. దేవదాస్ 2 నామినేషన్ పత్రాలు సమర్పించారు.
అలాగే బళ్లారి లోక్ సభ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఈ. తుకారాం 3 సెట్ల నామినేషన్ పత్రాలు, బీజేపీ అభ్యర్థి శ్రీరాములు 3 సెట్ల నామినేషన్ పత్రాలు, పార్టీయేతర అభ్యర్థి భాగ్యలక్ష్మి 2 సెట్ల నామినేషన్ పత్రాలు కలిపి మొత్తం 10 నామినేషన్ పత్రాలు సమర్పించారు. నామినేషన్ పత్రాల సమర్పణకు ఏప్రిల్ 19వ తేదీ చివరి తేదీ కావడంతో ఏప్రిల్ 20వ తేదీన నామినేషన్ పత్రాల పరిశీలన జరుగుతుంది.
ఏప్రిల్ 22వ తేదీ నామినేషన్ పత్రాలను ఉపసంహరించుకోవడానికి చివరి రోజు అని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ప్రశాంత్ కుమార్ మిశ్రా తెలిపారు. మొత్తం మీద ఇప్పుడు బళ్లారిలో మాజీ మంత్రి శ్రీరాములు భార్య భాగ్యలక్ష్మి స్వతంత అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. మైనింగ్ కింగ్, మాజీ మంత్రి, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి ఇటీవలే బీజేపీలో చేరడంతో బళ్లారి రాజకీయాలు మంచి కాకమీద ఉన్నాయి.
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇక ఒక్క మిస్డ్ కాల్తో గ్యాస్ బుకింగ్: కొత్త నంబర్లు ఇవే! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!!












Click it and Unblock the Notifications