వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఘన విజయం, ఒక్కడే హంగామా చేశాడు, వైరల్ వీడియో!

|
Google Oneindia TeluguNews

బాగల్ కోటే (కర్ణాటక): కర్ణాటకలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయాలతో ముందు దూసుకుపోతుంది. మైసూరు, శివమొగ్గ, తుమకూరు నగర కార్పొరేషన్లు, 29 సిటీ మునిసిపాలిటీలు, 53 పట్టణ మునిసిపాలిటీలు, 23 పట్టణ పంచాయితీలలో ఆగస్టు 31వ తేదీ ఎన్నికలు జరిగాయి.

ఆగస్టు 31వ తేదీ జరిగిన ఎన్నికల కౌంటింగ్ సెప్టెంబర్ 3వ తేదీ సోమవారం జరుగుతున్నది. అనేక జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. ఉత్తర కర్ణాటక, కరావళి ( సముద్ర తీర ప్రాంతాలు) లో బీజేపీ ముందుకు దూసుకుపోతున్నది.

BJP candidate celebrates his victory by removing his shirt in Bagalkote in Karnataka

బాగల్ కోటే సిటీ మునిసిపాలిటీలోని 35 వార్డుల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 29 వార్డులలో విజయం సాదించి రికార్డు సృష్టించింది. కాంగ్రెస్ పార్టీ ఆరు వార్డులలో విజయం సాదించింది. బాగల్ కోటేలో జేడీఎస్ అభ్యర్థులు ఒక్కరూ విజయం సాదించలేదు.

బాగల్ కోటే సిటీ మునిసిపాలిటీ 19వ వార్డు నుంచి పోటీ చేసిన వీరప్ప సిరగణ్ణ విజయం సాదించారు. ఎన్నికల్లో తాను విజయం సాదించానని తెలుసుకున్న వీరప్ప కౌంటింగ్ కేంద్ర ముందు షర్టు విప్పి గాల్లో తిప్పుతూ ఒక్కడే పండగ చేసుకున్నారు.

వీరప్ప షర్టు విప్పి గాల్లో తిప్పుతున్న సమయంలో తిసిన వీడియో సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో వైరల్ అయ్యింది. మొత్తం మీద అనేక జిల్లాల్లో కాంగ్రెస్, జేడీఎస్ మళ్లీ ఒక్కటై బీజేపీని వీలైనంత వరకూ అధికారానికి దూరం చెయ్యాలని కర్ణాటక ప్రభుత్వ పెద్దలు నిర్ణయించారు.

English summary
Karnataka Civic Polls: Veerappa Siragannavar, BJP candidate from ward No. 19 of Bagalkote municipal council, celebrates his victory in the urban local body polls by removing his shirt.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X