రెండోసారి కిందపడిన అమిత్ షా, పట్టుకున్న భద్రతా సిబ్బంది (వీడియో)
భోపాల్: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు (బీజేపీ) అమిత్ షా మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఉండగా జారిపడ్డారు. ఆయన అశోక్ నగర్ తులసీ పార్క్‌లో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. అనంతరం వేదిక మెట్లు దిగుతూ జారికిందపడ్డారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆయనను పైకి లేవదీశారు.
ఈ ఘటనలో ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదు. తాను బాగానే ఉన్నానని అక్కడి వారితో ఆ తర్వాత చెప్పారు. అమిత్ షా కార్యక్రమంలో పాల్గొన్న ఓ వ్యక్తి ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయింది.
అమిత్ షాకు గురువారం కూడా ఇదే చేదు అనుభవం ఎదురైంది. మిజోరం పర్యటనకు వెళ్లిన ఆయన హెలికాఫ్టర్ నుంచి మెట్లు దిగుతుండగా జారిపడ్డారు. ఆ సమయంలోను ఆయనకు ఏమీ కాలేదు.

మిజోరాంలోని వెస్ట్ తుయ్‌పుయ్ నియోజకవర్గానికి ఆయన ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. త్లబంగ్ గ్రామంలో ఆయన హెలికాప్టర్ ల్యాండ్ అయింది. అయితే హెలికాప్టర్ నుంచి దిగుతూ చూసుకోకుండా ఓ మెట్టు వదిలేశారు. దాంతో ఆయన అమాంతం కిందపడిపోయారు. వెంటనే వ్యక్తిగత సిబ్బంది అప్రమత్తమైన ఆయన్ను పైకి లేపి, దుస్తులకు అంటిన దుమ్మును దులిపారు. ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది.
అనంతరం మధ్యప్రదేశ్ శివపురి జిల్లాలో జరిగిన పబ్లిక్ మీటింగ్‌లో అమిత్ షా పాల్గొని కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. నవంబర్ 28వ తేదీన జరిగే మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ గెలుస్తుందని ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ కలలు కంటున్నారని విమర్శించారు.
నేను విమానాశ్రయం నుంచి వచ్చే సమయంలో అక్కడ టీవీ ఛానల్స్‌లలో చూశానని, మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని రాహుల్ గాంధీ చెబుతున్నారని, కానీ అది నెరవేరదని చెప్పారు. మధ్యప్రదేశ్‌లో గెలుస్తామని ఆయన పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు.
మధ్యప్రదేశ్‌లో ఈనెల 28న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ పదిహేనేళ్లుగా బీజేపీ అధికారంలో ఉంది. 2003 నుంచి కమలం పార్టీ చేతిలోనే మధ్యప్రదేశ్ ఉంది. ఈసారి ఎలాగైనా చేజిక్కించుకోవాలని కాంగ్రెస్, పట్టు నిలుపుకోవాలని బీజేపీ భావిస్తోంది. మధ్యప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్, చత్తీస్‌గడ్, తెలంగాణ, మిజోరాంలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 11న రానున్నాయి.
Watch: BJP President Amit Shah falls off stage during a rally in Ashok Nagar, MP. pic.twitter.com/yYms64xTwm
— Prashant Kumar (@scribe_prashant) November 24, 2018












Click it and Unblock the Notifications