కన్నడ నటుడు శివరాజ్‌కుమార్‌పై బీజేపీ ఫిర్యాదు..

క‌న్న‌డ న‌టుడు శివ‌రాజ్‌కుమార్‌పై బీజెపీ ఫిర్యాదు చేసింది. దేశంలో ఎన్నిక‌ల హంగామా మొద‌ల‌య్యింది. ఈ త‌రుణంలో ద‌క్షిణాది రాష్ట్ర‌మైన క‌ర్ణాట‌క‌లో న‌టుడు శివ‌రాజ్‌కుమార్ లోక్‌సభ ఎన్నికల కోసం కర్ణాటకలో కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారంపై బిజెపి మండిప‌డింది. ఆ రాష్ట్రంలో సినీ న‌టుల ఎన్నిక‌ల ప్ర‌చారంపై బీజెపి తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తోంది. అస‌లు విష‌యానికొస్తే...

క‌ర్ణాట‌క‌లోని శివమొగ్గ లోక్‌సభ నియోజకవర్గం నుంచి శివరాజ్‌కుమార్ భార్య‌ గీతా శివరాజ్‌కుమార్ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీకి దిగుతున్నారు. భార్య త‌ర‌పున న‌టుడు శివ‌రాజ్ కుమార్ కాంగ్రెస్ ప్ర‌చారానికి సిద్ధ‌మ‌య్యారు. దీంతో క‌ర్ణాట‌క రాష్ట్రంలో రాజ్‌కుమార్ మూవీలు, ప్రకటనలు, హోర్డింగ్‌లపై నిషేధం విధించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు బిజెపి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు కూడా చేసింది. భార్య గీతా శివరాజ్‌కుమార్ తరఫున ఎన్నిక‌ల ప్రచారం చేస్తున్న స్టార్ హీరో శివ‌రాజ్‌కుమార్ సినిమాలు బ్యాన్ చేయాలని ఎన్నిక‌ల సంఘాన్ని కోరింది. ఈ మేరకు బీజేపీ సీనియర్ నాయకుడు ఆర్ రఘు ఎన్నికల సంఘానికి ఓ లేఖ కూడా రాశారు.

BJP complains against Kannada actor Shivrajkumar

ఎన్నిక‌లు పూర్త‌య్యేంత‌వ‌ర‌కు సినిమాలు, యాడ్‌లు బ్యాన్ చేయాలి..

ఈ నేప‌థ్యంలో ఎన్నికలు పూర్త‌య్యే వ‌ర‌కు ఆయన సినిమాలు, ప్రచారాలు నిలిపివేయాలని బీజెపి సీనియ‌ర్ నాయకుడు డిమాండ్ చేశారు. లోక్‌సభ ఎన్నికలు పూర్త‌య్యేంత‌వ‌ర‌కు న‌టుడు శివరాజ్‌కుమార్‌ సినిమాలు, ప్రకటనలు, హోర్డింగ్‌లను ప్రదర్శిన‌లు నిలిపివేసేలా సినిమా హాళ్లు, టీవీ ఛానెల్‌లు, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు, స్థానిక సంస్థలకు ఆదేశాలు జారీ చేయాలని ఆయ‌న ఎన్నిక‌ల సంఘాన్ని కోరారు. బీజేపీ సీనియర్ నాయకుడు ఆర్ రఘు రాసిన లేఖను పరిశీలిస్తున్నట్లు కర్ణాటక సీఈవో వివ‌రించారు.శివమొగ్గ నుంచి నియోజక‌వ‌ర్గం నుంచి బీజేపీ పార్టీ త‌ర‌పున క‌ర్ణాట‌క మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప తనయుడు, సిట్టింగ్‌ ఎంపీ బీవై రాఘవేంద్ర పోటీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అదే నియోజ‌క‌వ‌ర్గానికి కాంగ్రెస్ త‌ర‌పున న‌టుడు శివ‌రాజ్‌కుమార్ భార్య గీతా శివరాజ్‌కుమార్ పోటీకి దిగుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+