అమేథిలో రాహుల్ గాంధీనే వదల్లేదు, నిన్ను మాత్రం వదిలేస్తామా ?, సీన్ రిపీట్ !
బెంగళూరు/రామనగర: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కొందరు నాయకులు కొందరు ప్రతిపక్ష నాయకులను టార్గెట్ చేసుకుని వారిని అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించాలని స్కెచ్ లు వేస్తున్నారు. అమేథిలో రాహుల్ గాంధీని వదలని మేము నిన్ను వదిలేస్తామని అనుకుంటున్నావా అంటూ కేపీసీసీ అధ్యక్షుడిని ఓ బీజేపీ సీనియర్ నేత హెచ్చరించడం హాట్ టాపిక్ అయ్యింది.
బెంగళూరు నగర శివార్లలోని కనకపుర అసెంబ్లీ నియోజక వర్గం నుంచి కేపీసీసీ అధ్యక్షుడు డీకే. శివకుమార్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే, కనకపురను కంచుకోట చేసుకున్న డీకే. శివకుమార్ తాను సులభంగా ఎమ్మెల్యే అయిపోతానని అనుకుంటున్నారు. అయితే డీకే శివకుమార్ మీద కర్ణాటక మంత్రి ఆర్. అశోక్ పోటీలోకి దిగడంతో ఆ నియోజక వర్గం పోరు రసవత్తరంగా మారిపోయింది.

మంత్రి ఆర్. అశోక్ ను గెలిపించాలని బీజేపీ నాయకులు ఇప్పటికే కనకపురలో ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశారు. కర్ణాటక మాజీ మంత్రి, తమిళనాడు బీజేపీ శాఖ ఇన్ చార్జ్ అయిన సీటీ. రవి కనకపురలో ఆర్. అశోక్ ను గెలిపించాలని బుధవారం ఎన్నికల ప్రచారం చేశారు. సీటీ. రవితో పాటు స్థానిక బీజేపీ నాయకులు పెద్ద సంఖ్యలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
ఈ సందర్బంగా బీజేపీ నేత సీటీ. రవి మాట్లాడుతూ అమేథిలో వరుసగా ఎంపీగా విజయం సాధిస్తున్న రాహుల్ గాంధీకి 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మేము సినిమా చూపించామని అన్నారు. అమేథి నియోజక వర్గంలో మీ నాయకుడు రాహుల్ గాంధీనే మేము వదల్లేదు. కనకపురలో నిన్ను వదిలేస్తామా అంటూ బీజేపీ నేత సీటీ. రవి కేపీసీసీ అధ్యక్షుడు డీకే. శివకుమార్ కు నేరుగానే వార్నింగ్ ఇచ్చారు.

అమేథిలో రాహుల్ గాంధీ ఓడిపోయారని కేరళలోని వాయినాడ్ లో విజయం సాధించిన రాహుల్ గాంధీ మా చేతుల్లో ఓటమి నుంచి తప్పించుకున్నారని బీజేపీ నాయకుడు సీటీ. రవి అన్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కనకపుర నియోజక వర్గం నుంచి బీజేపీ నాయకుడు ఆర్. అశోక్ కచ్చితంగా విజయం సాధిస్తారని, అందులో ఎలాంటి డౌట్ లేదని బీజేపీ సీనియర్ నాయకుడు సీటీ. రవి ధీమా వ్యక్తం చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.
-
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..!












Click it and Unblock the Notifications