వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లోక్‌సభలో దుమారం - బీజేపీ ఎంపీల ఆందోళన : రంజన్‌ చౌధరీ క్షమాపణలు..!!

|
Google Oneindia TeluguNews

పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన వెంటనే లోక్ సభలో దుమారం చెలరేగింది. బీజేపీ ఎంపీలు కాంగ్రెస్ లోక్‌సభాపక్ష నేత అధీర్‌ రంజన్‌ చౌధరీ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసారు. కేంద్రం మంత్రి స్మృతి ఇరానీ లోక్ సభలో.. ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ రాజ్యసభలో అధీర్‌ రంజన్‌ చౌధరీ వ్యాఖ్యలను తప్పు బడుతూ ఫైర్ అయ్యారు. ఆయన క్షమాపణలు చెప్పాలంటూ బీజేపీ సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో..సభలో గందరగోళం ఏర్పడింది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును ఉద్దేశించి వ్యాఖ్యలు చేసారు.

రాష్ట్రపతిని కించపరిచేలా వ్యాఖ్యానించిందుకు కాంగ్రెస్‌ పార్టీ క్షమాపణ చెప్పాలంటూ బీజేపీ ఎంపీలు సభలోపలా.. బయటా ఆందోళనకు దిగారు. పార్లమెంటు ఆవరణలో చేపట్టిన ఆందోళనతో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తోపాటు మహిళా ఎంపీలు పాల్గొన్నారు. దేశ రాష్ట్రపతిని కాంగ్రెస్‌ పార్టీ అవమానపరిచిందని మండిపడ్డారు. అయితే, దీని పైన కాంగ్రెస్ అధినేత్రి సోనియా స్పందించారు. ఇప్పటికే అధీర్‌.. క్షమాపణలు చెప్పారని చెప్పుకొచ్చారు. క్షమాపణలు చెప్పినా అందోళన చేయటం పైన కాంగ్రెస్ ఆరోపణలు చేసింది.

BJP Demands Apology from Congress on Adhir Chowdhurys comments in parliament

అధికార, ప్రతిపక్ష పార్టీ సభ్యుల పోటాపోటీ నినాదాలతో ఉభయసభలు హోరెత్తాయి. దీంతో వాయిదా పడ్డాయి. అటు రాజ్యసభలో గందరగోళం ఏర్పడింది. ఇప్పటికే సస్పెండ్ అయిన ఎంపీలు పార్లమెంట్ ప్రాంగణంలో 50 గంటల దీక్ష కొనసాగిస్తున్న సమయంలో..ఈ రోజు రాజ్యసభ నుంచి మరో ముగ్గురు సభ్యులు సస్పెండ్ అయ్యారు. నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ముగ్గురు సభ్యులను ఈ సెషన్ పూర్తయ్యే వరకూ సస్పెండ్ చేస్తున్నట్లు డిప్యూటీ ఛైర్మన్ రూలింగ్ ఇచ్చారు. ఈ రోజు సస్పెండ్ అయిన వారిలో ఇద్దరు ఆప్.. ఒక స్వంతంత్ర ఎంపీ ఉన్నారు.

English summary
BJP MPs in Lok Sabha demanding an apology from Congress interim president Sonia Gandhi on MP Adhir Chowdhury's comments on Preident.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X