జస్వంత్‌కు బర్మేర్ సీటు నిరాకరణ, ఇండిపెండెంట్‌గా...
జైపూర్: సీనియర్ నేత జస్వంత్ సింగ్‌కు భారతీయ జనతా పార్టీ (బిజెపి) రాజస్థాన్‌లోని బర్మేర్ సీటు టికెట్‌ను నిరాకరించింది. ఈ మేరకు బిజెపి శుక్రవారంనాడు నిర్ణయం తీసుకుంది. ఈ స్థానం నుంచి కాంగ్రెసు నుంచి తమ పార్టీలో చేరిన మాజీ శాసనసభ్యుడు సోనారామ్‌కు ఇవ్వాలని బిజెపి నిర్ణయిచింది.
పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ లోకసభ సీటు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న జస్వంత్ సింగ్ ఈసారి రాజస్థాన్‌లోని బర్మేర్ నుంచి పోటీ చేయాలని అనుకున్నారు. డార్జిలింగ్‌కు తాను ఎంతో చేశానని, చేయాల్సిందంతా చేశానని, ఎన్నికల్లో తన చివరి పోటీ ఇది అని, దాంతో తన సొంత ప్రాంతంలో పోటీ చేయాలని అనుకున్నానని జస్వంత్ సింగ్ అన్నారు.

తనకు బర్మేర్ టికెట్ ఇవ్వకపోతే స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగుతానని ఆయన అంతకు ముందు చెప్పారు. దీంతో ఆయన ఈ నెల 24వ తేదీన నామినేషన్ వేసే అవకాశం ఉంది. బర్మేర్ స్వగ్రామం జసోల్ బర్మేర్ జిల్లాలో ఉంది. ఆయన కుమారుడు మన్వీందర్ సింగ్ రెండు సార్లు ఈ స్థానం నుంచి పోటీ చేశారు.
బర్మేర్ నుంచి సోనారామ్‌ను పోటీకి దించాలని రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే అనుకుంటున్నారు. ఝాట్ ప్రజలు ఎక్కువ మంది ఉండడంతో ఝాట్ అభ్యర్థి అయితే విజయం సానుకూలమవుతుందని ఆమె భావిస్తున్నారు.
-
తమిళనాడులో NDA సీట్ల పంపకాల్లో బిగ్ ట్విస్ట్, లేలెస్ట్ సర్వే ఎఫెక్ట్ - ఎవరికెన్ని..!! -
మందు బాబులకు బిగ్ షాక్.. 2 రోజులు వైన్స్ బంద్.. -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్!












Click it and Unblock the Notifications