బీజేపీని రాముడే కాపాడాలి: స్వామి

న్యూఢిల్లీ: బీజేపీ నాయకులు రోజుకు ఒక విధంగా స్టేట్ మెంట్స్ ఇస్తూ పార్టీని ఇరకాటంలోకి నెట్టేస్తున్నారు. ముఖ్యంగా బీహార్ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత బీజేపీ నాయకుల స్టేట్ మెంట్స్ మరీ ఎక్కువ అయ్యాయి.

ఇప్పుడు ప్రముఖ న్యాయవాది, బీజేపీకి చెందిన సీనియర్ నాయకుడు డాక్టర్ సుబ్రమణ్య స్వామి మరో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీని ప్రస్తుతం రాముడు ఒక్కడే కాపాడగలడని ఆయన మంగళవారం ట్విట్ చేసి సొంత పార్టీ నాయకులకు షాక్ ఇచ్చారు.

ఆయన చేసిన ట్విట్ కు కొన్ని ఉదహరణలు చెప్పుకున్నారు. 1977లో లోక్ సభలో 330 స్థానాలు జనతా పార్టీకి ఉన్నాయని గుర్తు చేశారు. తరువాత 1980లో జరిగిన లోక్ సభ ఎన్నికలలో 31 స్థానాలకు పడిపోయిందని గుర్తు చేశారు.

 BJP firebrand leader Dr. Subramanya Swamy

తరువాత బీజేపీ విడిపోయి గాంధీయవాదం, సామ్యవాదాలను చేపట్టిందని గుర్తు చేశారు. అదే విధంగా 1984లో జరిగిన లోక్ సభ ఎన్నికలలో రెండు స్థానాలకు పడిపోయిందని అన్నారు. అనంతరం రాముడు వచ్చి బీజేపీని రక్షించి గట్టునపడేశాడని సుబ్రమణ్యస్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీహార్ ఎన్నికలలో బీజేపీ చితకలపడిన తరువాత బీజేపీకి సొంత పార్టీ నాయకులు పలు సలహాలు ఇస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+