దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్: ఎంపీలతో మోడీ భేటీ; భవిష్యత్ ఎన్నికలపై బీజేపీ ఎంపీలకు దిశానిర్దేశం
భారతీయ జనతా పార్టీ రానున్న సార్వత్రిక ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని ఇప్పటి నుంచే వ్యూహాలను మొదలుపెట్టింది. అఖండ భారత దేశాన్ని కాషాయీకరణ చేయాలని భావిస్తున్న భారతీయ జనతా పార్టీ ఆ దిశగా అడుగులు వేస్తోంది. 2023 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ అధిష్టానం ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా దక్షిణాది రాష్ట్రాలపై ఫోకస్ పెట్టింది బిజెపి. ఈ క్రమంలోనే దక్షిణాది రాష్ట్రాల బీజేపీ ఎంపీలతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. ఆయా రాష్ట్రాల్లో పార్టీ బలోపేతం, కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై ఎంపీలకు ప్రధాని మోదీ దిశానిర్దేశం చేశారు.

పార్టీని బలోపేతం చెయ్యటంపై ఫోకస్ పెట్టిన బీజేపీ అధిష్టానం
ప్రధాని నివాసంలో ఏర్పాటు చేసిన బీజేపీ ఎంపీల సమావేశం సందర్భంగాఎంపీ ప్రధాని మోదీ అల్పాహార విందు ఏర్పాటు చేశారు . ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల ఎంపీలు హాజరయ్యారు. దాదాపు గంటపాటు జరిగిన సమావేశంలో పలు కీలక అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. భేటీ సందర్భంగా తాజా రాజకీయ పరిస్థితులు, వివిధ కేంద్ర సంక్షేమ పథకాల అమలుపై ఎంపీలతో మోదీ చర్చించారు. ఆయా రాష్ట్రాల్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీల పనితీరుపై ప్రధాని మోదీ ఆరా తీశారు. ఆయా రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేయడం, కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై ఎంపీలకు ప్రధాని నరేంద్ర మోదీ దిశానిర్దేశం చేశారు.

తెలంగాణా ఎంపీలకు మోదీ చెప్పిందిదే
పార్లమెంట్ సమావేశాల సందర్భంగా వివిధ రాష్ట్రాల ఎంపీలకు అల్పాహార విందు ఏర్పాటు చేసిన ప్రధాని, అన్ని రాష్ట్రాల ఎంపీలతో సమాలోచనలు జరుపుతున్నారు. మళ్ళీ ఎన్నికల్లో కూడా బీజేపీ అధికారంలోకి రావటం కోసం ఇప్పటి నుండే పని చేస్తున్నారు. బుధవారం దక్షిణాది రాష్ట్రాల పార్లమెంటు సభ్యులతో సమావేశమయ్యారు. మోదీతో సమావేశానికి తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ధర్మపురి అరవింద్, సోయం బాపురావు హాజరయ్యారు. ప్రధాని మోదీ గారికి తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడానికి అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే తెలంగాణా సారధి బండి సంజయ్ నేతృత్వంలో తెలంగాణాలో బీజేపీ దూకుడు చూపిస్తుంది. దాన్ని మరింత పెంచాలని, వచ్చే ఎన్నికల్లో జనాలకు ఆప్షన్ గా బీజేపీ మాత్రమే కనిపించేలా పని చెయ్యాలని ఆయన సూచించినట్టు సమాచారం.

ఏపీ ఎంపీలు క్షేత్రస్థాయిలో బలంగా పని చెయ్యాలని సూచించిన మోదీ
మోడీతో సమావేశానికి ఆంధ్రప్రదేశ్‌కి చెందిన బీజేపీ ఎంపీలు జీవీఎల్ నరసింహారావు, సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్ తదితరులు హాజరయ్యారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో తాజా రాజకీయ పరిస్థితిని, క్షేత్రస్థాయిలో బీజేపీ ఏవిధంగా ముందుకు వెళ్లాలి అన్న అంశాలను, ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా బిజెపి ఎదగడానికి ఏం చేయాలి అన్న దానిపై ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ ఎంపీలకు దిశానిర్దేశం చేసినట్లుగా సమాచారం. భారతీయ జనతా పార్టీని దేశవ్యాప్తంగా బలోపేతం చేసేందుకు అధిష్టానం ప్రచురిస్తున్న ప్రణాళికల్లో భాగంగా వివిధ అంశాలపై మోడీ చర్చించారు. 2023 ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ దూసుకుపోతోందని, దక్షిణాది రాష్ట్రాలలో కూడా సత్తా చాటే విధంగా ముందుకు వెళ్లాలని మోదీ సూచించారు.

ఉత్తరాదిలో తిరుగులేని రాజకీయ శక్తిగా బీజేపీ.. దక్షిణాదిలోనూ ఎక్కువ సీట్లు సాధించే ప్లాన్
ఇప్పటికే ఇప్పటికే ఉత్తరాదిలో తిరుగులేని శక్తిగా ఎదిగిన ఆ పార్టీ.. దక్షిణాదిలోనూ సత్తా చాటాలని భావిస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఎప్పటి నుంచో పాగా వేయాలని భావిస్తోంది. దీనికోసం ముఖ్యంగా తెలంగాణ, ఏపీలో వలసల ద్వారా పార్టీని బలోపేతం చేయాలని, వచ్చే ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ ఎంపీ సీట్లు గెలుచుకోవాలని పార్టీ నాయకత్వం ఎప్పటి నుంచో భావిస్తోంది. అందుకే దక్షిణాది రాష్ట్రాలపై మోదీ ఫోకస్ చేసినట్లుగా సమాచారం. ఇక రానున్న ఎన్నికలకు ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా ఎత్తుగడలతో ముందుకు వెళ్లాలని భావిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన బీజేపీ ఎంపీలతో సమావేశమయ్యారు.

బీజేపీకి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీల కూటమిని ఏర్పాటు ప్రయత్నాల వేళ మోదీ భేటీలపై ఆసక్తి
పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణతో పాటు మరిన్ని అంశాలపై బీజేపీ సీఎంలతో ప్రధాని మోదీ చర్చించారు. బీజేపీ ప్రభుత్వంపై పోరాటానికి పెద్ద ఎత్తున సన్నాహాలు జరుగుతున్న సమయంలో ఈ భేటీ జరిగింది. దక్షిణాది రాష్ట్రాలలో ముఖ్యమంత్రులను కలుస్తూ ప్రాంతీయ పార్టీల కూటమిని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో మోదీతో ఎంపీల భేటీ రాజకీయంగా ప్రాధాన్యంగా మారింది. ఏది ఏమైనా ఈసారి దక్షిణాది రాష్ట్రాలపై గట్టిగా ఫోకస్ చేస్తున్న బిజెపి కచ్చితంగా దక్షిణాదిలో పాగా వేయడానికి ఎత్తుగడలతో ముందుకు వెళుతుంది.
-
కేంద్రానికి కవిత షాకింగ్ అల్టిమేటం.. ఆ విషయంలో పోరాటమే! -
Viral Video: ముస్లింలకు పోటీగా మాధవీలత పూజలు..! వీడియో వైరల్..! -
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
ప్రధాని మోదీపై ప్రశంసలు, మనసులో మాట బయట పెట్టిన జగన్..!! -
Tamil Nadu Survey: తాజా సర్వేలో బీజేపీకి భారీ షాక్- గెలిచేది మాత్రం వీరే..? -
తమిళనాడులో NDA సీట్ల పంపకాల్లో బిగ్ ట్విస్ట్, లేలెస్ట్ సర్వే ఎఫెక్ట్ - ఎవరికెన్ని..!! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..!












Click it and Unblock the Notifications