సీఎంకు ఖర్చీ అందుకే ఊగిపోతావుందా ?, ప్రతిపక్షాల దెబ్బకు అధికార పార్టీకి చినిగిపోతా ఉంది !
బెంగళూరు: 2024 లోక్‌సభ ఎన్నికలకు కర్ణాటక కాంగ్రెస్ సన్నద్ధమవుతోంది. కర్ణాటకలో కనీసం 20 లోక్ సభ సీట్లు గెలుచుకోవడానికి కాంగ్రెస్ పార్టీ పక్కాప్లాన్ తో సిద్ధం అవుతోంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సమస్యలను ఎదుర్కొంటోందని కర్ణాటక రాష్ట్ర బీజేపీ శాఖ ట్వీట్ చేసింది. కర్ణాటక రాష్ట్ర చరిత్రలో కర్ణాటక, కన్నడ జెండాలను ఎన్నికలకు వాడుకున్న ఏకైక రాజకీయ పార్టీ కాంగ్రెస్ అని బీజేపీ మండిపడుతోంది.
దేశ ప్రజలలో భాషా విద్వేషం అనే విషబీజాలు నాటుతూ రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ దేశానికి, కర్ణాటకు చేసిందేమీ లేదని బీజేపీ నాయకులు మండిపడుతున్నారు. కర్ణాటకకు, కన్నడ బాష కోసం కాంగ్రెస్ పార్టీ ఈ 50 ఏళ్లలో ఏం చేసింది అనే విషయాన్ని కర్ణాటక సీఎం సిద్దరామయ్య చెప్పలేకపోయారని, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కర్ణాటక కోసం చేసింది ఏమీ లేదని బీజేపీ నాయకులు ఎద్దేవ చేశారు.

కేవలం ఎన్నికల సమయంలోనే కన్నడ బాష, కర్ణాటక సమస్యలను తవ్వి తీసి రాజకీయంగా లబ్ధి పొందే కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో గోకాక్ ఉద్యమం ఎందుకు జరగాల్సి వచ్చిందో మీరే ప్రజలకు వివరించాలని, ఆ తప్పు చేసింది ఎవరు అని మీకుమీరే ప్రశ్నించుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. కర్ణాటకను ఆరు దశాబ్దాలుగా పాలించినా కన్నడిగులకు ఉద్యోగాలు కల్పించలేదన్న అపవాదు కాంగ్రెస్ మూటకట్టుకున్న మాట వాస్తవం కాదా ? అని కర్ణాటక బీజేపీ సిద్దరామయ్య ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత సిద్దరామయ్య ప్రభుత్వానికి 8 ప్రధాన సమస్యలు పట్టిపీడిస్తున్నాయని బీజేపీ ఆరోపించింది.

*. సీఎం కుర్చి కాపాడుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ నాయకుల కుమ్ములాట
*. మంత్రి పదువులు పంపకంలో అన్యాయం జరిగిందని సీనియర్ల అసమ్మతి.
*. బెళగావి జిల్లాలో మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్ తో ప్రభుత్వానికి సమస్యలు.
*. హోమ్ మంత్రి డాక్టర్ పరమేశ్వర్ ఇంటిలో జరిగిన డిన్నర్ పార్టీ రాద్దాంతం.
*. డీసీఎం పదవుల కోసం సీనియర్ మంత్రుల లాబీ.
*. బోర్డు, కార్పోరేషన్ బోర్డుల నియామకాలు జరగకపోవడంతో సీనియర్లతో సమస్యలు.
* అసెంబ్లీ నియోజక వర్గాలకు నిధులు మంజూరు కాకపోవడంతో ఎమ్మెల్యేలతో సమస్యలు.
*. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఖర్చుల కోసం కలెక్షలు కాకపోవడంతో సిద్దరామయ్య ప్రభుత్వానికి సమస్యలు వచ్చాయని కర్ణాటక బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు.
-
మందు బాబులకు బిగ్ షాక్.. 2 రోజులు వైన్స్ బంద్.. -
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి












Click it and Unblock the Notifications