వరల్డ్ కప్ ఫైనల్స్ ముందు హైకమాండ్ కు మూడ్ వచ్చింది. ప్రతిపక్ష నేత పేరు, హమ్మయ్యా !

బెంగళూరు: వరల్డ్ కప్ ఫైనల్స్ ముందు బీజేపీ హైకమాండ్ కు మూడ్ వచ్చింది. కర్ణాకట అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయి తరువాత ఆరు నెలల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఆ రాష్ట్రంలోని అసెంబ్లీలో బీజేపీ ప్రతిపక్ష నేతను ఎంపిక చేసింది. బెంగళూరు నగరంలోని పద్మనాభనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి ఆర్. అశోక్ కర్ణాటక విధాన సౌధాలో ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు. ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికైన అనంతరం ఆర్. అశోక్ మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు.

బెంగళూరులో జరిగిన బీజేపీ లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో బీజేపీ సీనియర్ నేత ఆర్ అశోక్‌ను కర్ణాటక అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఎన్నుకుంటున్నామని కర్ణాటక మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ ప్రకటించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత ఎట్టకేలకు బీజేపీ ప్రతిపక్ష నేత పేరును ప్రకటించింది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బీవై విజయేంద్ర ఎన్నికైన రెండో రోజే బీజేపీ కూడా ప్రతిపక్ష నేత పేరును ప్రకటించింది.

 BJP high command appointed R Ashok as leader of opposition in Karnataka Assembly

ఆర్. అశోక్ బెంగళూరులోని పద్మనాభనగర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఒక్కలిగ సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ నాయకుడు ఆర్. అశోక్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ మంత్రివర్గంలో రెవెన్యూ శాఖా మంత్రిగా పనిచేశారు.

లింగాయత్ కులంలో ఎంతో పేరు ఉన్న నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప కుమారుడు బీవై విజయేంద్రను కర్ణాటక రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం ద్వారా వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో లింగాయత్ ఓట్లను ఆకర్షించేందుకు బీజేపీ వ్యూహరచన చేసింది. ఇప్పుడు రాష్ట్రంలోని మరో శక్తివంతమైన కులం అయిన ఒక్కలిగ ఓట్లను ఆకర్షించేందుకు ఆర్. అశోక్ ను ప్రతిపక్ష నేతగా బీజేపీ హైకమాండ్ ఎంపిక చేసిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

 BJP high command appointed R Ashok as leader of opposition in Karnataka Assembly

ఆర్. అశోక్ ప్రతిపక్ష నేతగా ఎన్నిక కావడంతో ఆయన అభిమానులు, అనుచరులు బాణాసంచ కాల్చి సంబరాలు చేసుకున్నారు. ప్రతిపక్ష నేతగా ఎన్నికైన అశోక్‌ ను మాజీ సీఎం బీఎస్‌ యడ్యూరప్ప, బసవరాజ్ బోమ్మయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర సహా పలువురు సీనియర్‌ నేతలు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతిపక్ష నేతగా ఎన్నికైన అనంతరం ఆర్. అశోక్ రాష్ట్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తుందని, రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని.. నాకు ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తానని అశోక్ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+