సెక్స్ స్కాండల్ కేసు, మొదటికే మోసం, మూడునాళ్ల ముచ్చట, మోదీ చేతికి బాల్, క్లైమాక్స్ లో!

లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ను ఓడించేందుకు బీజేపీ-జేడీఎస్ పొత్తు పెట్టుకుంది. అయితే హాసన్ ప్రస్తుత ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించిన సెక్స్ స్కండల్ కేసు రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా జాతీయ స్థాయి రాజకీయాల్లో కలకలంరేపింది. ఈ ఉదంతం బీజేపీ, జేడీఎస్ కూటమి నేతలను తీవ్ర ఇబ్బందికి గురి చేసింది. ప్రజ్వల్ రేవణ్ణ దెబ్బతో బీజేపీ నేతలు ఆలోచనలో ఉన్నారని తెలిసింది.

ఏప్రిల్ 26వ తేదీన కర్ణాటకలో మొదటి దశ పోలింగ్ జరిగింది, ఈ పోలింగ్‌కు ఒక రోజు ముందు హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ పెన్ డ్రైవ్ విడదల అయ్యింది. అదే సమయంలో హాసన్ లోక్‌సభ నియోజకవర్గానికి ఎన్నిక కూడా జరిగింది. అశ్లీల వీడియోలు వైరల్ అయ్యే సమయానికి హాసన్ కూటమి అభ్యర్థి ప్రజ్వల్ రేవణ్ణ ఓటు వేసి విదేశాలకు పారిపోయారు. ప్రజ్వల్ విదేశాలకు వెళ్లిన తర్వాత అశ్లీల వీడియోలు విపరీతంగా వైరల్ అయ్యాయి.

BJP high command leaders are thinking of breaking the alliance with JDS

హాసన్‌ సిట్టింగ్‌ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ అశ్లీల వీడియోల కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోందని, దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం చెప్పాలని కాంగ్రెస్‌ నేతలు ఇప్పటికీ డిమాండ్ చేస్తూనే ఉన్నారు. హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అశ్లీల వీడియో కేసు జాతీయ స్థాయిలో బీజేపీకి తీవ్ర ఇబ్బందిని కలిగించింది. ఈ నేపథ్యంలో కర్ణాటకలో జేడీఎస్ తో పొత్తు కొనసాగించాలా వద్దా అనే చర్చ బీజేపీ అంతర్గత వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.

మొదట్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఒక్కలిగ సామాజికవర్గం నేతలు ఈ పొత్తుపై పూర్తిగా ఏకీభవించకపోవడంతో పొత్తుపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పుడు ప్రజ్వల్ రేవణ్ణ కేసుతో తీవ్ర ఇబ్బంది పడుతున్న బీజేపీ నేతల్లో పొత్తు కొనసాగించాలా ? లేదా అన్న చర్చ సాగుతోంది. అలాగే ఈ విషయంపై బీజేపీ నేతలు నోరు మెదపకుండా కాంగ్రెస్ నేతలు పలు ఆరోపణలు చేస్తున్నారు, ఈ నేపథ్యంలో పొత్తుపై బీజేపీ నాయకులు లోలోపల చర్చలు సాగిస్తున్నారని తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+