Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బిజెపి ఓ అమెరికన్ పార్టీ: లాలూ ప్రసాద్, ఒబామాకి థ్యాంక్స్

పాట్నా: భారతీయ జనతా పార్టీపై విమర్శలు చేసే అవకాశం వస్తే వదులుకోని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ మరోసారి ఆ పార్టీపై తనదైన శైలిలో ధ్వజమెత్తారు. భారత్‌లో ఇటీవలే ముగిసిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పర్యటనను కూడా బిజెపిపై విమర్శలు గుప్పించేందుకు ఉపయోగించుకోవడం గమనార్హం.

దేశంలో ఒబామా పర్యటన ముగిసిన మరునాడే, లాలూ ప్రసాద్ బిజెపిపై విరుచుకుపడ్డారు. బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్ జయంతి ఉత్సవంలో పాల్గొన్న సందర్భంగా లూలూ సందర్భంగా లాలూ మాట్లాడుతూ.. జెపి ఒక అమెరికన్ పార్టీ అని అభివర్ణించారు. ఇందుకు ఒబామాకు అసాధారణ రీతిలో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన మర్యాదలే నిదర్శనమని చెప్పారు.

BJP is an American party, says Lalu Prasad

‘నరేంద్ర మోడీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం, ఒబామాకు ఏ స్థాయిలో రాచమర్యాదలు చేసిందో చూశారుగా!, బిజెపిని అమెరికాకు చెందిన పార్టీ అని చెప్పేందుకు ఇంతకన్నా నిదర్శనమేం కావాలి? ఇదే విషయాన్ని నేను చాలా కాలం నుంచి చెబుతూనే ఉన్నాను' అని లాలూ ప్రసాద్ యాదవ్ వ్యాఖ్యానించారు.

సిరిఫోర్ట్‌ వద్ద ఒబామా చేసిన ప్రసంగాన్ని సైతం ప్రస్తావించిన లాలూ.. తనదైన రీతిలోబిజెపిపై విమర్శనాశ్రాలు సంధించారు. ఒబామా ప్రసంగం మోడీ అసలు రంగును బయటపెట్టిందని అన్నారు. ఇందుకు ఈ సందర్భంగా ఒబామాకు కృతజ్ఞతలు చెబుతున్నానని చెప్పారు. మతం, వర్ణం ఆధారంగా ప్రజలను విభజించవద్దని ఒబామా చెప్పారని.. అదే తాను చాలా కాలం నుంచి చెబుతున్నానని లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+