బీజేపీ బిగ్ మిస్టెక్: నెహ్రూను స్త్రీ లోలుడిగా చూపించబోయి.. ఇలా!

నెహ్రూ వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసే రీతిలో వ్యవహరించిన బీజేపీ.. చివరకు తానే చిక్కుల్లో పడినట్టయింది.

న్యూఢిల్లీ: గుజరాత్ ఎన్నికలవేళ వ్యక్తిగత ఆరోపణలు రచ్చకెక్కుతున్నాయి. ఇప్పటికే హార్దిక్ పటేల్‌పై సెక్స్ టేపు ఆరోపణలు రాగా.. ఇప్పుడు నెహ్రూను టార్గెట్ చేసింది బీజేపీ.

నెహ్రూ వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసే రీతిలో వ్యవహరించిన బీజేపీ.. చివరకు తానే చిక్కుల్లో పడినట్టయింది. నెహ్రూను స్త్రీ లోలుడిగా చూపించే క్రమంలో బీజేపీ జాతీయ ఐటీ విభాగం ఇన్‌చార్జ్‌ అమిత్ మాలవీయ తప్పులో కాలేశారు. నెహ్రూ సోదరి విజయలక్ష్మి పండిట్ ఆయనను ఆత్మీయంగా హత్తుకున్న ఫోటోలను పోస్టు చేసి.. 'చూడబోతే హార్దిక్‌కు నెహ్రూ డీఎన్‌ఏ బాగా ఎక్కువ ఉన్నట్టుంది' అంటూ వ్యాఖ్యానించారు.

మాలవీయ పోస్టు చేసిన 9ఫోటోల్లో రెండు ఫోటోల్లో విజయలక్ష్మి పండిట్ ఉన్నారు. ఫోటోలపై నెటిజెన్లు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. మాలవీయ అజ్ఞానాన్ని, నీచబుద్ధిని బయటపెట్టుకున్నారని కొంతమంది విమర్శిస్తుంటే.. ఇలాంటివి పోస్టు చేసేముందు ముందే పరిశీలించుకోవాలని మరికొంతమంది సలహాలిస్తున్నారు.

మిగతా ఏడు ఫోటోలు కూడా ఏమంత అభ్యంతరకరమైనవి కావని కొంతమంది నెటిజెన్స్ అభిప్రాయపడుతున్నారు. అమిత్ మాలవీయ పోస్టుకు కౌంటర్ గా కొంతమంది నెటిజెన్స్ ప్రధాని నరేంద్ర మోడీ ఆయా దేశాధ్యక్షులను ఆలింగనం చేసుకున్న ఫోటోలను పోస్టు చేసి వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+