షాక్: మీ ఎమ్మెల్యేలు మీ ప్రభుత్వాన్ని కూల్చేస్తారు, చేతులు కట్టుకోం, బళ్లారి శ్రీరాములు!

బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిపోతే బీజేపీ చేతులు కట్టుకుని కుర్చోదని, కచ్చితంగా అధికారంలోకి వస్తామని బీజేపీ ఎమ్మెల్యే బళ్లారి శ్రీరాములు అన్నారు. మీ ప్రభుత్వాన్ని మీ ఎమ్మెల్యేలు కూల్చుతారని, మేము మాత్రం ఆ ప్రయత్నాలు చెయ్యమని బళ్లారి శ్రీరాములు చెప్పారు.

బుధవారం మీడియాతో మాట్లాడిన బళ్లారి శ్రీరాములు బీజేపీ నాయకులు సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని అన్నారు. సంకీర్ణ ప్రభుత్వంలోనే కుమ్ములాట మొదలైయ్యిందని బళ్లారి శ్రీరాములు ఆరోపించారు.

BJP Karnataka MLA B.Sriramulu clarified that they will not destabilize the government

కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక వర్గం, జేడీఎస్ నాయకులు ఒక వర్గంగా విడిపోయి పోట్లాడుకుంటున్నారని, మధ్యలో బీజేపీని ఎందుకు లాగుతున్నారని బళ్లారి శ్రీరాములు మండిపడ్డారు. అధికారుల బదిలీలతో కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాట మొదలైయ్యిందని బళ్లారి శ్రీరాములు అన్నారు.

కాంగ్రెస్ పార్టీ అసమ్మతి ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెలుతున్నారని, దానికి బీజేపీకి ఏం సంబంధం అని శ్రీరాములు ప్రశ్నించారు. సంకీర్ణ ప్రభుత్వంలోని అసమ్మతిని తాము దూరం నుంచి చూస్తున్నామని, మీ ప్రభుత్వాన్ని పడగొట్టాలనే ఉద్దేశం మాకు లేదని శ్రీరాములు స్పష్టం చేశారు.

సంకీర్ణ ప్రభుత్వం మీద ప్రజలకు నమ్మకం లేదని, మీ పార్టీలోని ఎమ్మెల్యేలు మిమ్మల్ని నమ్మడం లేదని శ్రీరాములు ఆరోపించారు. మీ ప్రభుత్వాన్ని మీరే కుల్చుకుంటారని, ఆ సమయంలో బీజేపీ చేతులు కట్టుకుని కుర్చోదని, ప్రభుత్వ ఏర్పాటుకు సిద్దం అవుతోందని శ్రీరాములు అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+