వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీకే సారే చౌకీదార్ చోర్ హై : యడ్డీ డైరీపై రాహుల్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : యడ్యూరప్ప డైరీలో రాసుకొన్న నగదు చెల్లింపుల అంశం ప్రకంపనలు రేపుతోంది. కారావాన్ మ్యాగజైన్ వెబ్‌సైట్ ప్రచురించిన వార్తను అస్త్రంగా చేసుకొని కమళదళంపై హస్తం నేతలు విరుచుకుపడ్డారు. స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు.

చౌకీదార్ చోర్ హై ..
యడ్యూరప్ప ఉదంతంతో బీజేపీ సర్కార్ అవినీతి మరోసారి స్పష్టమైందన్నారు కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ. BJP ke sare Chowkidar Chor Hai అని ట్వీట్ చేశారు. ఈ అవినీతిలో నరేంద్రమోదీ (నమో), అరుణ్ జైట్లీ, రాజ్ నాథ్ సింగ్ భాగస్వామ్యులని ట్వీట్ చేశారు. తన సీఎం పదవీ ఉండేందుకు రూ.1800 కోట్ల ఇచ్చినట్టు డైరీలో యడ్యూరప్ప రాసుకొన్నాడని, దీని కన్నా ఏం రుజువులు కావాలని ప్రశ్నించారు. స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

BJP ke sare Chowkidar Chor Hai : rahul tweet on yaddi dairy issue

బీజేపీ నేతలకు కోట్లు ఇచ్చినట్టు యడ్యూరప్ప డైరీ, విచారణకు కాంగ్రెస్ డిమాండ్, తోసిపుచ్చిన యడ్డీబీజేపీ నేతలకు కోట్లు ఇచ్చినట్టు యడ్యూరప్ప డైరీ, విచారణకు కాంగ్రెస్ డిమాండ్, తోసిపుచ్చిన యడ్డీ

కాంగ్రెస్‌కు కలిసివస్తోందా ?

దేశవ్యాప్తంగా ప్రకంపనాలు రేపుతోన్న యడ్డీ డైరీ ఇష్యూ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కలిసి వస్తోందా అనే చర్చ జరుగుతోంది. కర్ణాటకతోపాటు దేశవ్యాప్తంగా బీజేపీ అవినీతిని యడ్డీ డైరీ ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసే అవకాశం ఉంది. ఈ క్రమంలో విపక్షాల ఐక్యతారాగానికి తోడు, యడ్డీ ఇష్యూ బీజేపీకి డ్యామేజీ చేస్తుందని అంచనా వేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.

English summary
Congress chief Rahul Gandhi, who was once again split with BJP, said, "Yeddyurappa's issue is clear. he tweeted ’bjp Ke dare Chowkidhar Chor Hai‘. In this corruption, Narendra Modi (Nomo.), Arun Jaitley and Raj Nath Singh .. rahul tweeted. Yeddyurappa had gone through a diary of Rs 1800 crore for what the evidence was. The Center has sought an inquiry into the independent investigation agency.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X