బెంగాల్ లో మ్యాజిక్ ఫిగర్ దాటేసిన బీజేపీ, అయినా.. ఆ గండం గట్టెక్కితేనే అధికారం..!!
పశ్చిమ బెంగాల్ లో మమతా కోటలు కూలుతున్నాయి. బీజేపీ దశాబ్దాల కల నెరవేరే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఓట్ల లెక్కింపులో తొలి నుంచి నువ్వా నేనా అన్నట్లుగా ఫలితాలు వస్తున్నాయి. అయితే, బీజేపీ తాజా ట్రెండ్స్ మేరకు మ్యాజిక్ ఫిగర్ ను దాటి ఆధిక్యత కొనసాగుతోంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇక్కడ వాస్తవ రూపం దాల్చుతున్నాయి. పదిహేనేళ్ల మమత పాలనకు ఓటర్లు ఇక ముగింపు పలుకుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇంకా.. పోలింగ్ లో ఊహించని ఫలితాలు వస్తే మినహా.. బెంగాల్ లో బీజేపీ ప్రభుత్వం ఖాయంగా కనిపిస్తోంది.
పశ్చిమ బెంగాల్ ఫలితాల పై స్పష్టత వస్తోంది. బీజేపీ - టీఎంసీ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా కొనసాగిన పోరు బీజేపీకి అనుకూలగా మారుతోంది. ఇప్పటి వరకు బీజేపీ 168 స్థానాల్లో ఆధిక్యత లో కొనసాగుతోంది. పశ్చిమ బెంగాల్ ఫలితాల పై స్పష్టత వస్తోంది. ట్రెండ్స్ ప్రజా నాడిని వెల్లడిస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజం అవుతాయా లేదా అనే టెన్షన్ వేళ వాస్తవ ఫలితాలు వస్తున్నాయి. పోస్టల్ బ్యాలెట్.. ఆ తరువాత ఈవీఎం ల కౌటింగ్ ప్రారంభించారు. తొలి ఫలితాల్లో టీఎంసీ కంటే బీజేపీ ఆధిక్యత కొనసాగుతోంది. రెండు పార్టీల మధ్య హోరా హోరీ పోరులో బీజేపీ ఆధిక్యత కొనసాగుతోంది. భవానీ పూర్, నందిగ్రాంలో సువేందు ఆధిక్యతలో నిలిచారు. ఇప్పటి వరకు వస్తున్న ట్రెండ్స్ కు అనుగుణంగా బీజేపీ 168 నియోజకవర్గాల్లో.. మమతా పార్టీ టీఎంసీ 124 స్థానాల్లో ఆధిక్యతలో ఉన్నాయి. కాగా, కాంగ్రెస్ 1 స్థానంలో లీడ్ లో ఉంది. పలు చోట్ల నువ్వా నేనా అన్నట్లుగా ఓట్లు కనిపిస్తున్నాయి.

ఇదే సరళి కొనసాగితే బీజేపీదే అధికారం
పశ్చిమ బెంగాల్ లో చోటు చేసుకున్న పరిణామాలతో అందరి దృష్టి పశ్చిమ బెంగాల్‌పైనే నిలిచింది. ఇక్కడ 294 అసెంబ్లీ స్థానాలుండగా, నేడు 293 స్థానాల ఫలితాలను ప్రకటించనున్నారు. ఇప్పటి వరకు అందుతున్న ఫలితాల మేరకు బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు ఖాయంగా కనిపిస్తోంది. ఇక.. ఫాల్టా నియోజకవర్గంలో పోలింగ్‌ను ఈసీ రద్దుచేసింది. ఇక్కడ ఈ నెల 21న పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలో గత మూడు ఎన్నికల్లో తిరుగులేని విజ యం సాధించిన టీఎంసీ నాలుగోసారి విజయంపై ధీమాగా ఉంది. మరోవైపు బెంగాల్‌లో పాగా వేయాలని శక్తియుక్తులన్నీ ధారపోసిన బీజేపీ కూడా తనదే విజయం అని చెప్పుకుంటోంది. ఎగ్జిట్‌పోల్స్‌లో ఎక్కువశాతం మాత్రం బీజేపీకే అనుకూలంగా వచ్చాయి. అయితే, తాము 200 పైచిలుకు స్థానాల్లో గెలవబోతున్నామని సీఎం మమత ప్రకటించారు. కాగా.. ఇప్పుడు ఫలితాల్లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యతతో ముందుకు వెళ్తోంది. ఫలితాల్లో అనూహ్య మలుపు తీసుకోకుంటే బీజేపీ తొలి సారి బెంగాల్ ను కైవసం చేసుకోవటం ఖాయంగా కనిపిస్తోంది.













Click it and Unblock the Notifications