రేప్: బీజేపీ నాయకుడి అరెస్ట్, లేడీస్ హాస్టల్లోకి కోప్

BJP leader, five others arrested in MP
భోపాల్/బెంగళూరు: మైనర్ బాలిక పైన అత్యాచారానికి పాల్పడ్డారన్న ఆరోపణలతో మధ్యప్రదేశ్‌లో బీజేపీ నాయకుడితో సహా ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఉజ్జయినిలో ఈ ఘటన జరిగింది. అసోంలోని డోయ్‌పాంగ్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి.. ముంబైలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి పదిహేనేళ్ల బాలికను మోసగించాడు.

అత్యాచారం చేసి ఆమెను ఇండోర్‌కు తీసుకు వచ్చాడు. అక్కడ ముంతాజ్ అనే ఏజెంటుకు ఆమెను అమ్మేశాడు. తర్వాత బాలికను రూ.4వేలకు నలుగురు వ్యక్తులకు ముంతాజ్ అమ్మేసింది. ఈ నలుగురు బాలికను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకు వెళ్లి లైంగికంగా వేధించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నిందితుల్లో బీజేపీ నాయకుడు హమీద్ సాదర్ కూడా ఉన్నాడు.

లేడీస్ హాస్టల్లోకి వెళ్లిన కానిస్టేబుల్

ఇరవై ఎనిమిదేళ్ల కానిస్టేబుల్ షఫియుల్లాను పోలీసులు అరెస్టు చేశారు. ఇతను కర్నాటక రాష్ట్రంలోని షిమోగా జిల్లాలోని అగుంబే దగ్గర్లోని లేడీస్ హాస్టల్లోకి వెళ్లాడనే ఆరోపణలతో జైలుకు పంపించారు.

కూతురి పట్ల తండ్రి అసభ్య ప్రవర్తన

మతిస్థిమితం లేని పదమూడేళ్ల ఓ బాలిక పైన ఆమె తండ్రి అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ సంఘటన కర్నాటకలో జరిగింది. ఒకళిపురంలోని లక్ష్మన్ రావు నగర్‌లో ఇది జరిగింది. అయితే, ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+