Pakistan wife: ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ, దుబాయ్ లో పాక్ పెళ్లాం, మీకు టోపీ, జాగ్రత్త!

కొచ్చి/ హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యే కావాలని, మన పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి కావాలని కలలు కంటున్న ఓ లీడర్ పై ప్రతిపక్ష పార్టీలు విరుచుకుపడుతున్నాయి. భారత్ లో మొదటి భార్య, దుబాయ్ లో పాకిస్థాన్ భార్యతో ఆ లీడర్ కులుకుతున్నాడని ప్రతిపక్ష నేత ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆ లీడర్ ప్రభుత్వం ముందే అతని కుటుంబ సభ్యుల వివరాలు రహస్యంగా దాచిపెట్టాడని, ఇక ప్రజలు అతన్ని గెలిపిస్తే ప్రజలకు ఏమాత్రం న్యాయం చెయ్యలేడని, మీకు టోపీ పెడుతాడని ఆరోపిస్తూ ఆలీడర్ పాకిస్థాన్ పెళ్లాం ఫోటో, ఆమె పాకిస్థాన్ ఐడీ కార్డుతో పాటు పూర్తి వివరాలు ప్రజల ముందు పెట్టడం కలకలం రేపింది.

కేరళ అసెంబ్లీ ఎన్నికల కుస్తీలు

కేరళ అసెంబ్లీ ఎన్నికల కుస్తీలు

కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ నాయకులతో పాటు కాంగ్రెస్, బీజేపీ తదితర పార్టీల నాయకులు పోటీ చేస్తున్నారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అన్ని పార్టీల నాయకులు నువ్వానేనా అంటు సవాళ్లు విసిరుకుంటున్నారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని, అధికార పార్టీనే మళ్లీ అధికారంలోకి వస్తుందని పలు సర్వేలు అంటున్నాయి.

సులేమాన్ హాజీ రామాయణం

సులేమాన్ హాజీ రామాయణం

కేరళలోని కొండొట్టి శాసన సభ నియోజక వర్గం నుంచి రెండు పార్టీల మద్దతుతో సులేమాన్ హాజీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. సులేమాన్ హాజికి సీపీఎం పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తోంది. కొండొట్టి శాసనసభ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న సులేమాన్ హాజీని టార్గెట్ చేసుకుని బీజేపీ నాయకులు రంగంలోకి దిగారు.

పాకిస్థాన్ పెళ్లాం ఉంది.... మీకు తెలుసా ?

పాకిస్థాన్ పెళ్లాం ఉంది.... మీకు తెలుసా ?

సులేమాన్ హాజీకి గతంలోనే వివాహం అయ్యింది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సులేమాన్ హాజీ పాకిస్థాన్ జాతీయురాలైన రెండో భార్య గురించి వివరాలు వెళ్లడించకుండా ప్రభుత్వాన్ని, ప్రజలను మోసం చేశాడని ఆరోపిస్తూ బీజేపీ సీనియర్ నాయకుడు మురళీధరన్ సంచలన ఆరోపణలు చేశారు.

ఇంతకంటే సాక్షం కావాలా.... మీరే చెప్పండి

ఇంతకంటే సాక్షం కావాలా.... మీరే చెప్పండి

పాకిస్థాన్ లోని రావల్పిండికి చెందిన 19 ఏళ్ల యువతిని సులేమాన్ హాజీ దుబాయ్ లో రెండో పెళ్లి చేసుకుని అక్కడే కాపురం పెట్టాడని ఆరోపిస్తూ బీజేపీ సీనియర్ నేత మురళీధరన్ ట్వీట్ చేశారు. సులేమాన్ హాజీ పాకిస్థాన్ జాతీయురాలిని పెళ్లి చేసుకున్న సమయంలో తీసుకున్న ఫోటో, ఆమె పాక్ జాతీయ గుర్తింపు కార్డును సైతం సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడం కలకలం రేపింది.

ప్రధాని మోదీ, అమిత్ షా ఎఫెక్ట్

ప్రధాని మోదీ, అమిత్ షా ఎఫెక్ట్

అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సులేమాన్ హాజీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోమ్ శాఖా మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ. నడ్డా, కేరళ బీజేపీ అధ్యక్షుడు కె. సురేంద్రన్ ను టార్టెట్ చేస్తూ అనేక ఆరోపణలు చేశారు. మా పార్టీ నాయకులను విమర్శిస్తావా అంటూ బీజేపీ నాయకులు ఇప్పుడు సులేమాన్ హాజీ పాకిస్థాన్ రెండో భార్య వ్యవహారం బయటకు తియ్యడం కలకలం రేపింది.

సీఎం సార్ మౌనం ఎందుకో ?

సీఎం సార్ మౌనం ఎందుకో ?

సులేమాన్ హాజీ పాకిస్థాన్ కు చెందిన యువతిని రెండో పెళ్లి చేసుకోవడమే కాకుండా ఆ వివరాలను నామినేషన్ పత్రాల్లో ఎందుకు వివరించలేదని, ఈ విషయంలో కేరళ ముఖ్యమంత్రి పనిరయి విజయన్ ఎందుకు మౌనంగా ఉన్నారని కేరళ బీజేపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. అయితే నామినేషన్ పత్రాల్లో భార్య సమాచారం పొందుపరచాలని నియమాలు లేవని ఎన్నికల అధికారులు అంటున్నారు.

సులేమాన్ కు గ్రీన్ సిగ్నల్

సులేమాన్ కు గ్రీన్ సిగ్నల్

ప్రతిపక్షాలు ఆరోపణలతో సులేమాన్ హాజీ నామినేషన్ పత్రాలను పక్కన పెట్టి పరిశీలించిన రిటర్నింగ్ అధికారులు సోమవారం సాయంత్రం ఆయన ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రిటర్నింగ్ అధికారి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తరువాత బీజేపీ నాయకులు సులేమాన్ హాజీని టార్గెట్ చేసుకుని ఆయన పాకిస్థాన్ రెండో భార్య వ్యవహారం తెరమీదకు తీసుకురావడం హాట్ టాపిక్ అయ్యింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+