హీరో దర్శన్ విషయంలో డ్రామాలు ఆడుతున్న సీఎం, కేసుల నుంచి తప్పించుకుంటే ?
శ్యాండిల్ వుడ్ హీరో, కన్నడ నటుడు దర్శన్ బళ్లారి జైలులో ఉండడం కర్ణాటక ప్రభుత్వానికి సిగ్గుచేటు అని, సిద్ధరామయ్య కటకటాల్లోకి వెళ్లకుండా చూసుకోవడానికి దర్శన్ విషయాన్ని జోరుగా ప్రచారం చేస్తున్నారని, దర్శన్ నిత్యం వార్తల్లో ఉంటే సీఎం సిద్ధరామయ్య కేసు కప్పిపుచ్చుకునేలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాన్ చేస్తోందని, ఇదంతా కర్ణాటక రాష్ట్ర ప్రజల దృష్టిని మరల్చే వ్యూహమని బీజేపీ కర్ణాటక రాష్ట్ర అధికార ప్రతినిధి అశ్వత్ నారాయణ గౌడ్ ఆరోపించారు.
శుక్రవారం బెంగళూరు నగరంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో బీజేపీ నాయకుడు ఆశ్వథ్ నారాయణ గౌడ మాట్లాడుతూ సీఎం సిద్దరామయ్యపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ కమల కోసం బీజేపీ నాయకులు రూ.100 కోట్లు ఆఫర్ చేశారని కాంగ్రెస్ చేస్తున్న ప్రచారంపై అశ్వత్ నారాయణ గౌడ్ మాట్లాడుతూ సీఎం సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అవినీతిని దాచిపెట్టడానికి బీజేపీ మీద వీళ్లు ఆరోపణలు చేస్తున్నారని అశ్వథ్ నారాయణ గౌడ మండిపడ్డారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు రూ. 100 కోట్ల ఆఫర్ మేము ఇచ్చామని కాంగ్రెస్ ఆరోపిస్తోందని, అంటే మార్కెట్ లో వంకాయలు, మిరపకాయలు అమ్మినట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను మార్కెట్ లో అమ్మేస్తారా అని, ఎవరు ఎవరికి ఆఫర్ ఇచ్చారో చెప్పాలని అశ్వథ్ నారాయణ గౌడ సీఎం సిద్దరామయ్యకు, డీకే శివకుమార్ కు సవాల్ విసిరారు.
తప్పుడు ఆరోపణలు చేసిన మండ్య కాంగ్రెస్ ఎమ్మెల్యే రవి గాణిగపై ఇప్పటికే మండ్యలో ఫిర్యాదు నమోదైందని బీజేపీ నాయకుడు అశ్వథ్ నారాయణ గౌడ అన్నారు.కాంగ్రెస్ ఎమ్మెల్యే రవి గనగపై అనర్హత వేటు వేయాలని కర్ణాటక స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తామని, దానంతట అదే పడిపోయే ఈ సిద్దరామయ్య ప్రభుత్వాన్ని మేము ఎందుకు దించాలని ప్రయత్నిస్తామని, ఇదంతా తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు సిద్ధరామయ్య పన్నిన ఎత్తుగడ అని బీజేపీ అధికార ప్రతినిధి అశ్వత్ నారాయణ గౌడ ఆరోపించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున
ఖార్గే ఫ్యామిలీ ట్రస్టుకు భూ కేటాయింపుల వ్యవహారంపై మాట్లాడిన బీజేపీ నాయకుడు అశ్వథ్ నారాయణగౌడ్ ఇదంతా చూస్తుంటే బహిరంగంగా భూకబ్జాలేనని ఆరోపించారు.ఖార్గే ఫ్యామిలీ సంస్థ నేపథ్యం ఏమిటి, ఇంత వరకు ఎంత మందికి శిక్షణ ఇచ్చారో తెలీదు అని, ఎంత మందికి ఉద్యోగాలు కల్పించారో తెలీదని, ఎలాంటి వివరాలు, సమాచారం లేకుండా ఆ సంస్థలకు భూములు ఎలా కేటాయించారో కూడా తెలీదని బీజేపీ అధికార ప్రతినిధి అశ్వథ్ నారాయణ గౌడ వ్యంగంగా అన్నారు. సిద్దరామయ్య ప్రభుత్వాన్ని ఆ పార్టీ నాయకులే కూల్చేస్తారని, బీజేపీ మాత్రం అందులో జోక్యం చేసుకోదని అశ్వథ్ నారాయణ గౌడ అన్నారు.












Click it and Unblock the Notifications