పవర్ స్టార్ తో ప్లాన్ చేస్తున్న బీజేపీ, పవన్ కళ్యాణ్ వస్తే లెక్క వేరే లెవల్లో ఉంటుంది !

బెంగళూరు/చిక్కబళ్లాపురం: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు కేవలం 10 రోజుల మాత్రమే సమయం ఉంది. ఎన్నికల ప్రచారానికి మాత్రం 8 రోజులు మాత్రమే ఉంది. ఇలాంటి సమయంలో బెంగళూరు, బెంగళూరు గ్రామీణ, కోలారు. చిక్కబళ్లాపురం జిల్లాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఎన్నికల ప్రచారం చేయించడానికి కొందరు నాయకులు సిద్దం అయ్యారని తెలిసింది.

ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని పలు అసెంబ్లీ నియోజక వర్గాల్లో నువ్వానేనా అంటూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు పోటీపడుతున్నారు. తెలుగు బాష ఎక్కువ శాతం మాట్లాడే ప్రజలు లక్షలాది మంది ఉన్న ఈ నియోజక వర్గాల్లో తెలుగు నటీనటులతో ఎన్నికల ప్రచారం చేయించాలని బీజేపీ నాయకులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.

BJP leaders are planning to campaign with power star Pawan Kalyan

కోలారు జిల్లాలోని శ్రీనివాసపురం, ముళబాగిలు, కోలారు, బెంగళూరులోని యలహంక తదితర ప్రాంతాల్లో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన బీజేపీ నాయకులు ఎన్నికల ప్రచారం చేశారు. ఇప్పుడు చిక్కబళ్లాపురం, బాగేపల్లి, శిడ్లఘట్ట, చింతామణి, కోలారు, కేజీఎఫ్, హోస్ కోటే, మాలూరు తదితర ప్రాంతాల మీద బీజేపీ నాయకులు ఎక్కువ శ్రద్ద చూపిస్తున్నారు.

ముఖ్యంగా చిక్కబళ్లాపురంలో కర్ణాటక మంత్రి డాక్టర్ సుధాకర్ గెలుపు కోసం ఇప్పటికే కన్నడ నటీనటులు ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. కన్నడ నటీనటులు హర్షికా పూణప్ప, బిగ్ బాస్ ఫేమ్ దివ్యా, ప్రముఖ నటులు దిగంత్, రఘు ముఖర్జీ, అనూ ప్రభాకర్ తదితరులు బీజేపీకి ఓటు వేసి మంత్రి సుధాకర్ ను గెలిపించాలని చిక్కబళ్లాపురం నియోజక వర్గంలో ఇంటింటికి తిరుగుతున్నారు.

ఇప్పుడు చిక్కబళ్లాపురంలో పాటు చిక్కబళ్లాపురం జిల్లా, కోలారు జిల్లాల్లోని పలు అసెంబ్లీ నియోజక వర్గాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైలాగ్ కింగ్ సాయికుమార్ తదితరులతో ఎన్నికల ప్రచారం చేయించాలని బీజేపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని తెలిసింది. కోలారు. చిక్కబళ్లాపురం, బెంగళూరు, బెంగళూరు గ్రామీణ జిల్లాల్లో పవన్ కళ్యాణ్ కు లక్షలాది మంది అభిమానులు ఉన్నారు.

ఇప్పటికే పవన్ కళ్యాణ్ ను కలిసి చర్చించిన బీజేపీ నాయకులు ఆయనతో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేయించాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది. చిక్కబళ్లాపురంలో తెలుగు స్టార్ హీరోలో బీజేపీ తరుపున ప్రచారం చేస్తారని స్థానిక బీజేపీ నాయకులు అంటున్నారు. అయితే ఏరోజు పవన్ కళ్యాణ్ కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు అని మాత్రం స్థానిక బీజేపీ నాయకులు క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+