ఆపరేషన్ కమల: షాక్ ఇచ్చిన బీజేపీ నాయకులు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లోకి జంప్!

బెంగళూరు: కర్ణాటకలో ఒక వైపు ఆపరేషన్ కమలతో బిజీగా ఉన్న బీజేపీ నాయకులకు కాంగ్రెస్ నాయకులు ఝలక్ ఇచ్చారు. బీజేపీకి చెందిన ముగ్గురు ప్రముఖ నాయకులకు గాలం వేసిన కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ సమక్షంలో వారిని తమ పార్టీలోకి ఆహ్వానించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

వీరు కాక ఎ. మంజు సైతం బీజేపీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. వీరందరికి నచ్చచెప్పడానికి మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య తీవ్రప్రయత్నాలు చేసి విఫలం అయ్యారు. తాము ఎవ్వరి మాట వినమని, కచ్చితంగా బీజేపీలో చేరుతామని ఈ నాయకులు తేల్చి చెప్పారు.

బీజేపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముగ్గురు నాయకులు మునివేళ్ల మీద నిలబడి ఉన్నారు. బీజేపీకి చెందిన మాజీ ఎమ్మెల్సీ కేబీ. శాణప్ప, మాజీ మంత్రి బాబురావ్ చౌహాన్, గురుమిఠకల్ కు చెందిన బీజేపీ ప్రముఖ నాయకుడు శ్యామరావ్ ప్యాటీ బీజేపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించారు.

 BJP leaders are set to join congress in next Rahul rally at Kalaburagi.

కులబరిగి నియోజక వర్గానికి చెందిన డాక్టర్ ఉమేష్ జాదెవ్ కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరి ఎంపీ ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే డాక్టర్ ఉమేష్ జాదెవ్ బీజేపీలో చేరడాన్ని కేబీ. శాణప్ప, బాబురావ్ చౌహాన్, శ్యామరావ్ వ్యతిరేకించారు.

కులబరిగిలో బీజేపీలో రెండు వర్గాలు అయ్యాయి. గతంలో మల్లికార్జన్ ఖార్గే మీద శ్యామరావ్ పోటీ చేసి ఓడిపోయారు. మార్చి 18వ తేదీన కులబరిగిలోని ఎన్ వీ కాలేజ్ మైదానంలో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభా సమావేశంలో రాహుల్ గాంధీ సమక్షంలో ఈ ముగ్గురు నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు.

ఆపరేషన్ కమలలో భాగంలో కాంగ్రెస్ కు చెందిన డాక్టర్ ఉమేష్ జాదవ్ కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఇంకా మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే రమేష్ జారకిహోళి, నాగేంద్ర, మహేష్ కమటహళ్ళి బీజేపీలో చేరడానికి సిద్దం అయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+