గాలి కుమార్తె పెళ్లి: బీజేపీ ఏం చెప్పిందంటే !

బెంగళూరు: అక్రమంగా ఆస్తులు కూడబెట్టుకున్నారని, అక్రమంగా మైనింగ్ వ్యాపారం చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి కుమార్తె పెళ్లికి హాజరుకావద్దని బీజేపీ నాయకులకు ఆ పార్టీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసిందని విశ్వసనీయంగా తెలిసింది.

పెద్ద నోట్ల రద్దు చేసి నల్లధనంపై పోరాటం చేస్తున్న సమయంలో నల్లధనం వెచ్చించి గాలి జనార్దన్ రెడ్డి తన కుమార్తె పెళ్లి చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపధ్యంలో ఈ శుభకార్యానికి హాజరైతే ప్రజల్లో తప్పుడు సంకేతాలు పంపే ప్రమాదం ఉందని బీజేపీ అధిష్టానం భావించింది.

బీజేపీ కర్ణాటక శాఖ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి, పార్లమెంట్ సభ్యుడు బీఎస్. యడ్యూరప్పకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా స్వయంగా ఫోన్ చేసి మన పార్టీ నాయకులు గాలి కుమార్తె పెళ్లికి హాజరుకావద్దు అనే విషయం చెప్పారని కొందరు బీజేపీ నాయకులు అంటున్నారు.

BJP leaders do not attend the Gali Janardhan Reddy daughter marriage !

గతంలో కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి రావడానికి గాలి జనార్దన్ రెడ్డి కీలకపాత్ర పోషించారు. అదే సమయంలో గాలి జనార్దన్ రెడ్డి, ఆయన సోదరుడు గాలి కరుణాకర్ రెడ్డి, గాలి సోదర సమానుడు, ప్రాణ మిత్రుడు బి. శ్రీరాములు మంత్రి పదువులు చేపట్టారు.

తరువాత అక్రమ మైనింగ్ కేసుల్లో గాలి జనార్దన్ రెడ్డి జైలుపాలైన తరువాత ఆయన్ను బీజేపీ నుంచి బహిష్కరించారు. జైలు జీవితం గడిపి గత సంవత్సరం జామీనుపై బయటకు వచ్చిన గాలి జనార్దన్ రెడ్డి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.

ఇప్పుడు తన కుమార్తె బ్రహ్మిణి వివాహానికి హాజరుకావాలని కర్ణాటకలోని బీజేపీలోని ప్రముఖ నాయకులందరికి గాలి జనార్దన్ రెడ్డి స్వయంగా శుభలేఖలు ఇచ్చారు. గాలి జనార్దన్ రెడ్డి కుమార్తె పెళ్లికి హాజరు కావాలా ? వద్దా ? అని బీజేపీ నాయకులు సతమతం అయ్యారు.

BJP leaders do not attend the Gali Janardhan Reddy daughter marriage !

ఇలాంటి సమయంలో కర్ణాటకలోని బీజేపీ నాయకులందరికి ఆ పార్టీ అధిష్టానం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని తెలిసింది. బీజేపీలో ఓ వెలుగు వెలిగిన గాలి జనార్దన్ రెడ్డికి ఆ పార్టీ నాయకులు షాక్ ఇస్తారా ? లేక పెళ్లికి హాజరవుతారా ? అనే విషయం స్పష్టంగా తెలియడం లేదు.

మంగళ, బుధవారం రోజుల్లో బెంగళూరులోని ప్యాలెస్ మైదానంలో గాలి జనార్దన్ రెడ్డి కుమార్తె బ్రహ్మిణి వివాహం హైదరాబాద్ కు చెందిన రాజీవ్ రెడ్డితో జరగనుంది. పెళ్లి దగ్గర పడిపోయిన సమయంలో బీజేపీ నాయకులకు ఆపార్టీ అధిష్టానం షాక్ ఇచ్చింది.

ఇప్పుడు బీజేపీ ప్రముఖులు డైలమాలో పడ్డారు. బీజేపీ ప్రముఖ నాయకులు హాజరుకాకపోయినా వారి కుటుంబ సభ్యులు పెళ్లికి హాజరౌతారని సమాచారం. ఎమైనా సరే బీజేపీలోని కొందరు నాయకులు మాత్రం పెళ్లికి తప్పకుండా హాజరౌతారని తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+